దీదీ లెక్క!..బీజేపీకి ఏపీలో గుండు సున్నానేనట!

సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశకు వచ్చాయి. మొత్తం ఏడు దశల్లో జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఇప్పటికే 6 దశలు ముగిసిపోగా… ఈ నెల 19న చివరి దశ పోలింగ్ జరగనుంది. ఆ వెంటనే 23న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. తొలి – మలి దశల పోలింగ్ లలో బీజేపీకి పెద్దగా పట్టు లేని ప్రాంతాల్లో ఎన్నికలు జరగగా… ఆ తర్వాత వరుసగా బీజేపీకి గట్టి పట్టున్న ప్రాంతాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఒక్కో దశ పోలింగ్ ముగుస్తుంటే… అధికార బీజేపీలో ఉత్సాహం పెరగాల్సింది పోయి… దాని స్థానే ఆందోళన పెరుగుతోంది. అదే సమయంలో ఒక్కో దశ ముగుస్తుంటే… విపక్షాల్లో జోష్ పెరుగుతోంది.ఈ క్రమంలో విపక్షాలు ఎదురు దాడిని పెంచుతూ ఉంటే… బీజేపీ నేతలు ఆత్మరక్షణలో పడిపోయారని చెప్పాలి. ఇలాంటి కీలక తరుణంలో మోదీ అన్నా – బీజేపీ అన్నా అంతెత్తున ఎగిరిపడుతున్న తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి – పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ… బీజేపీ శిబిరంపై తనదైన శైలి సెటైర్లు వేశారు. తనను గద్దె దింపడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోందని – అయినా దేశవ్యాప్తంగా బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయన్న విషయంపై దీదీ ఇప్పుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రాంతీయ పార్టీల బేస్టియన్లుగా నిలిచిన ఏపీ – తమిళనాడులో బీజేపీకి దక్కే సీట్లు ఎన్ని  అన్న అంశంపైనా ఆమె ఆసక్తికర విశ్లేషణలు విప్పారు. అంతటితో ఆగని దీదీ… మొత్తంగా బీజేపీ ఈ దఫా ఎన్ని సీట్లను కోల్పోతుందన్న విషయంపైనా ఆమె తనదైన జోష్యం చెప్పారు.

Related posts

Leave a Comment