మోహ‌న్ బాబు భార్య‌గా ప్ర‌తినాయ‌క పాత్రలో ఐష్‌

మాజీ మిస్ వ‌ర‌ల్డ్ ఐశ్వ‌ర్య‌రాయ్ చివ‌రిగా ఫన్నేఖాన్ అనే సినిమాతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌కరించింది. ఆచితూచి క‌థ‌ల‌ని ఎంపిక చేసుకుంటున్న ఐశ్వ‌ర్య‌రాయ్ కల్కి రచించిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ పుస్తకం ఆధారంగా తెరకెక్క‌నున్న చిత్రంలో న‌టించ‌నున్న‌ట్టు ఆ మ‌ధ్య వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. నందిని అనే పాత్ర కోసం ఐష్‌ని మ‌ణిర‌త్నం సంప్ర‌దించాడని, అందుకు ఆమె గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ని టాక్. తాజా స‌మాచారం ప్ర‌కారం ఐష్ ఈ చిత్రంలో ప్ర‌తినాయ‌క పాత్ర‌లో క‌నిపించ‌నుంద‌ట‌. ఈ పాత్ర రాజ్యాధికారం మీద మక్కువతో ద్రోహానికి పాల్పడేదిగా ఉంటుందట. చిత్రంలో మోహ‌న్ బాబు కూడా కీల‌క పాత్ర పోషిస్తుండ‌గా, ఆయ‌న భార్య‌గా ఐష్ క‌నిపించ‌నుంద‌ని తెలుస్తుంది. మద్రాస్ టాకీస్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ కలిసి నిర్మిస్తున్న ఈ చారిత్రాత్మ‌క చిత్రంలో జయం రవి, విక్రమ్, అనుష్క, కీర్తి సురేష్, విజయ్ సేతుపతిలు కూడా నటించనున్నారు.

Related posts

Leave a Comment