హైదరాబాద్‌లో ఎఫ్5 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్

అమెరికాకు చెందిన ప్రముఖ ఐటీ సంస్థ ఎఫ్5 హైదరాబాద్‌లో తన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను గురువారం ప్రారంభించింది. హైదరాబాద్ హైటెక్ సిటీలోని ఎఫ్5 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను సంస్థ అధ్యక్షుడు, సీఈవో ఫ్రాంకోయిస్ లాకో డ్యూనో, ఇండియా ఉపాధ్యక్షుడు రవి కాశీనాథుని, కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు కారా స్ప్రాగ్, రాష్ట్ర ప్రభుత్వ సీఆర్‌వో అమర్‌నాథ్‌రెడ్డి ఆత్మకూరి కలిసి ప్రారంభించారు. అనంతరం సంస్థ సీఈవో ఫ్రాంకోయిస్ లాకో డ్యూనో మీడియాతో మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్త విస్తరణ ప్రణాళికల్లో భాగంగా భారత్‌లో తమ కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని భా వించి హైదరాబాద్‌ను సరైన కేంద్రంగా ఎంచుకొన్నామన్నారు. 

Related posts

Leave a Comment