ఓలా మ‌నీ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డును లాంచ్ చేసిన ఓలా..!

ప్ర‌ముఖ క్యాబ్ కంపెనీ ఓలా.. ఎస్‌బీఐ బ్యాంక్‌తో క‌ల‌సి ఓలా మ‌నీ ఎస్‌బీఐ పేరిట ఓ నూత‌న క్రెడిట్ కార్డును భార‌త్‌లో ఇవాళ విడుద‌ల చేసింది. ఈ కార్డును పొందేందుకు క‌స్ట‌మ‌ర్లు ఎలాంటి రుసుం చెల్లించాల్సిన ప‌నిలేదు. ఇక ఈ కార్డుతో ప్రొడ‌క్ట్స్‌ను కొనుగోలు చేస్తే 20 శాతం వ‌ర‌కు క్యాష్‌బ్యాక్ ఇస్తారు. ఓలా క్యాబ్‌ల‌లో వెళ్లిన‌ప్పుడు ఓలా మనీ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుతో పేమెంట్ చేస్తే 7 శాతం క్యాష్‌బ్యాక్ ఇస్తారు. అలాగే క్లియ‌ర్‌ట్రిప్ ఫ్లైట్ టిక్కెట్ల‌పై 5 శాతం క్యాష్‌బ్యాక్ ఇస్తారు. డొమెస్టిక్ టిక్కెట్లు అయితే రూ.5వేల వ‌ర‌కు, ఇంట‌ర్నేష‌న‌ల్ టిక్కెట్లు అయితే రూ.15వేల వ‌ర‌కు క్యాష్ బ్యాక్ ల‌భిస్తుంది.

Related posts

Leave a Comment