ర‌కుల్ సీన్‌కి క‌త్తెరేసిన సెన్సార్ బోర్డ్

అందాల భామ ర‌కుల్ ప్రీత్ సింగ్ హిందీలో అజయ్‌ దేవగణ్‌ కథానాయకుడిగా నటించిన సినిమా దే దే ప్యార్ దేలో క‌థానాయిక‌గా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే .టబు చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది . ఇటీవ‌ల చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల చేయ‌గా, దీనికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అజ‌య్ ప్రియురాలిగా ర‌కుల్ అద‌రగొట్ట‌గా, ఆయ‌న మాజీ భార్య‌గా ట‌బు న‌టించారు. ప్ర‌మోష‌న్‌లో భాగంగా చిత్రానికి సంబంధించి ‘వడ్డీ షరాబన్‌..’ అనే పాట విడుద‌ల చేశారు. ఈ పాటలో రకుల్.. చేతిలో మందు బాటిల్ పట్టుకొని తాగుతూ పంజాబీ స్టైల్‌లో ఆడుతూ.. పాడుతూ రచ్చ చేసింది. ఈ పాట‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అయితే విస్కీ బాటిల్ ప‌ట్టుకొని ర‌కుల్ డ్యాన్స్ చేయ‌డంపై తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేసిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్(సీబీఎఫ్సీ) ఆ సీన్‌కి క‌త్తెరేసింది. ఆ సీన్‌ని తొల‌గించ‌డం లేదంటే బాటిల్ స్థానంలో పూల‌గుత్తి వాడండి అంటూ సెన్సార్ బోర్డ్ చిత్ర యూనిట్‌కి స‌ల‌హా ఇచ్చింది. దీంతో పాటు మ‌రో రెండు డైలాగ్స్ కూడా తొల‌గించాల‌ని టీం ఆదేశించింది. అకీవ్‌ అలీ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

Related posts

Leave a Comment