6న నైరుతి రాక


ఈ ఏడాది నైరుతి రుతుపవనాల రాక కాస్త ఆలస్యం కానుంది. వచ్చే నెల 6న రుతుపవనాలు కేరళలోకి ప్రవేశిస్తాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) బుధవారం అధికారికంగా ప్రకటించింది. ఏటా రుతుపవనాలు జూన్‌ 1న కేరళలోకి ప్రవేశిస్తాయి. తరువాత ఉత్తరంగా పురోగమించి జూలై 15 కల్లా దేశవ్యాప్తంగా విస్తరిస్తాయి. ప్రస్తుతం అండమాన్‌, నికోబార్‌ దీవుల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో రుతుపవనాల రాకకు అనుకూల వాతావరణం ఏర్పడింది. దీంతో ఈనెల 18, 19 తేదీల్లో దక్షిణ అండమాన్‌, నికోబార్‌ దీవులు, ఆగ్నేయ బంగాళాఖాతంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

Related posts

Leave a Comment