టాటా కొత్త కారు.. వావ్ అనిపిస్తోంది!

దేశీ దిగ్గజ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ అయినప్పటికీ టాటా మోటార్స్‌ కంపెనీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. టాటా మోటార్స్ కంపెనీ కార్లు ఇతర కంపెనీల మోడళ్లతో పోలిస్తే ప్రత్యేకంగా కనిపించడం ఇందుకు కారణం. 

ఇటీవల కంపెనీకి చెందిన టాటా హారియర్ మోడల్‌లో మోడిఫైడ్ వెర్షన్ ఒకటి వాహన ప్రియులను తెగ ఆకట్టుకుంటోంది. దీని పేరు టాటా హారియర్ బ్లాక్ ఎడిషన్. చూడటానికి ఈ కారు ప్రీమియం లుక్‌తో కనిపిస్తోంది. కారు పెయింటింగ్ ఇందుకు కారణం. 

కారు ముందు భాగంలో గ్రిల్ నలుపు రంగులో ఉంది. టాటా లోగో కూడా డార్క్ కలర్‌‌లోనే చూడొచ్చు. కారు బంపర్ కూడా ఇదే రంగులో ఉంది. దీంతో డేటైమ్ రన్నింగ్ లైట్స్ మాత్రం బాగా హైలైట్ అయ్యాయి. 

Related posts

Leave a Comment