త్వరలో రవిప్రకాశ్ అరెస్టు?

ఫోర్జరీ కేసులో టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్ అరెస్టుకు రంగం సిద్ధమైనట్టు సమాచారం. తమ ఎదుట హాజరుకావాలంటూ బుధవారం ఉదయం 11 గంటల వరకు సమయం ఇస్తూ సైబరాబాద్ సైబర్‌క్రైం పోలీసులు నోటీసులు జారీచేసినా.. రవిప్రకాశ్ విచారణకు డు మ్మాకొట్టారు. ఇప్పటికే రెండుసార్లు నోటీసులిచ్చినా ఆయన నుంచి స్పందన లేకపోవడంతో తదుపరి చర్యలపై సైబరాబాద్ పోలీసులు దృష్టిపెట్టారు. కాగా, తనపై సైబర్‌క్రైం పోలీసులు నమో దుచేసిన కేసులు రాజ్యాంగ విరుద్ధమంటూ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదంటూ హైకోర్టు కొట్టివేసింది. ఇప్పటివరకు ఇచ్చిన నోటీసులకు స్పందించకపోవడంతో రవిప్రకాశ్‌ను అరెస్టు చేసేందుకు సిద్ధమవుతున్నామని, ఇప్పటికే ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్టు సైబరాబాద్ పోలీస్ ఉన్నతాధికారి ఒకరు నమస్తే తెలంగాణకు తెలిపారు.

Related posts

Leave a Comment