జగన్ కోసమే తలనీలాలు సమర్పించా: హాస్యనటుడు పృథ్వీరాజ్

జగన్ సీఎం కావాలని శ్రీ వెంకటేశ్వరుడిని కోరుకున్నానని వైసీపీ నాయకుడు, ప్రముఖ హాస్యనటుడు పృథ్వీరాజ్ అన్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఆయన సందర్శించుకున్నారు. అనంతరం, మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఇంత వరకూ తన కోసం స్వామి వారికి ఏ మొక్కూ మొక్క లేదు, తలనీలాలు ఇవ్వలేదని అన్నారు. జగన్ సీఎం కావాలని కోరుకుంటూ తన తలనీలాలు తొలిసారిగా ఇచ్చానని అన్నారు. జగన్ సీఎం అయ్యేందుకు ఎటువంటి ఆటంకం లేకుండా చూడాలని, ఆ సీటులో ఆయన్ని కూర్చోబెట్టి, ప్రజారంజకమైన పాలన అందించే శక్తిని ఆయనకు ప్రసాదించమని కోరుకున్నట్టు చెప్పారు. 

శ్రీవారిని దర్శించుకున్న మరో వైసీపీ నేత కొడాలి నాని మాట్లాడుతూ, వైసీపీకి అత్యధిక స్థానాలు రావాలని, జగన్ సీఎం కావాలని, రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆ దేవుడిని వేడుకున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో ఉన్న కరవు పరిస్థితుల నుంచి కాపాడాలని ఏడుకొండల వాడిని కోరానని అన్నారు.

Related posts

Leave a Comment