రైతు ఆదాయం రెట్టింపుపై సర్కార్ నజర్

 అన్నదాతల ఆదాయం రెట్టింపు చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. ఇప్పటికే రైతుబంధు పథకంతో ఎకరాకు రూ.నాలుగు వేలు ఇస్తుండగా.. పెట్టుబడి వ్యయాన్ని మరిం త తగ్గించాలని యాక్షన్‌ప్లాన్ సిద్ధం చేసింది. ప్రధాన పంటలైన వరి, మక్కజొన్న, పప్పు ధాన్యాలు, పల్లీల దిగుబడిలో వ్యత్యాసాలను తగ్గించి ఉత్పత్తి పెంచాలని నిర్ణయించింది. తెలంగాణ విత్తనోత్పత్తికి ఎంతో అనుకూలమైన ప్రదేశం. ఏటా దాదాపు 37.42 లక్షల క్వింటాళ్ల వివిధ రకాల విత్తనాలు ఉత్పత్తి అవుతున్నాయి. దేశవ్యాప్తంగా అవసరమైన వరి విత్తనాలు 90 నుంచి 95 శాతం మన రాష్ట్రంలోనే ఉత్పత్తి అవుతున్నాయి. 2022 నాటికి దేశ రైతుల ఆదాయం రెట్టింపు చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. దీనిని సాధ్యం చేసేలా తెలంగాణ సర్కార్ ఇప్పటికే చర్యలు తీసుకోవడం మొదలుపెట్టింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మణిపూర్ రాష్ట్రాలు ఇప్పటికే రైతుల ఆదాయం రెట్టింపు పై సొంత వ్యూహాలను రచించుకున్నాయి. మన రాష్ట్రంలో వ్యవసాయశాఖ నోడల్‌శాఖ గా, కమిషనర్ చైర్మన్‌గా, ఉద్యానశాఖ, మార్కెటింగ్‌శాఖ సంచాలకులు సభ్యులుగా, వ్యవసాయ వర్సిటీ పరిశోధనా డైరెక్టర్ సభ్య కన్వీనర్‌గా ఒక కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ ఇటీవలే సమావేశమై పలు కీలక సిఫారసులు చేసింది.

Related posts

Leave a Comment