తెలంగాణ రాష్ట్రాల్లో మళ్లీ పెరిగిన ఉష్ణోగ్రతలు

ఈసారి సూర్యుడు రికార్డు బద్దలు కొడుతున్నాడు. ఇప్పటికే తన ప్రతాపం ఏంటో చూపిన భానుడు.. బుధవారం నుంచి మరింత రెచ్చిపోనున్నాడు. ఉత్తర భారతం నుంచి వచ్చే వేడిగాలులతో తెలంగాణలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మూడు రోజులపాటు వడగాల్పులు ఎక్కువగా ఉంటాయి. వాయువ్యదిశ నుంచి వచ్చే గాలుల ప్రభావంతో మే నెలాఖరు వరకు ఉష్ణోగ్రతలు ఘననీయంగా పెరుగుతాయి. జూన్ మొదటి వారం వరకు ఎండల ప్రభావం ఉంటుంది. తెలంగాణ కోల్ హీట్ వేవ్ జోన్ పరిధిలో ఉంది. రాజస్థాన్ నుంచి ప్రారంభమయ్యే ఈ జోన్ పరిధిలో తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్ గడ్, ఒడిసా, ఆంధ్రప్రదేశ్. ఈ ప్రాంతాల్లో సూర్యకిరణాలు నిటారుగా పడతాయి. దీంతో ఉష్ణోగ్రత, వడగాల్సుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

Related posts

Leave a Comment