ప్రస్తుతం తెలంగాణను చినజీయర్ స్వామి పరిపాలిస్తున్నారు!: ప్రొ.కంచ ఐలయ్య ఆరోపణ

తెలంగాణ రాష్ట్రాన్ని ప్రస్తుతం చినజీయర్ స్వామి పరిపాలిస్తున్నారని ప్రొఫెసర్ కంచ ఐలయ్య విమర్శించారు. దళిత, బీసీ పక్షపాతిని అని చెప్పుకునే తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పటివరకూ ఒక్క అంబేద్కర్ విగ్రహానికి కూడా నివాళులు అర్పించలేదని స్పష్టం చేశారు. ఇటీవల హైదరాబాద్ లో అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చేసినా కేసీఆర్ స్పందించలేదని విమర్శించారు. అసలు అంబేద్కర్ తో పెట్టుకున్నవాళ్లు ఎవ్వరూ బాగుపడలేదని హెచ్చరించారు. హైదరాబాద్ లో సీపీఎం ఆధ్వర్యంలో జరిగిన ‘అంబేద్కర్‌ విగ్రహం ప్రతిష్టించి, దోషులను శిక్షించడం’ అనే సదస్సులో ఐలయ్య పాల్గొన్నారు.

Related posts

Leave a Comment