పేటీఎం క‌స్ట‌మ‌ర్ల‌కు క్రెడిట్ కార్డ్.. ఫ‌స్ట్ కార్డ్‌ను లాంచ్ చేసిన పేటీఎం

ప్ర‌ముఖ డిజిట‌ల్ వాలెట్ యాప్ పేటీఎం త‌న క‌స్ట‌మ‌ర్ల కోసం పేటీఎం ఫ‌స్ట్ కార్డ్ పేరిట ఓ నూత‌న క్రెడిట్ కార్డును ఇవాళ భార‌త్‌లో లాంచ్ చేసింది. సిటీ బ్యాంక్‌తో భాగ‌స్వామ్యం అయిన పేటీఎం ఈ కార్డును ఇవాళ ప్ర‌వేశ‌పెట్టింది. ఈ కార్డు ద్వారా క‌స్ట‌మ‌ర్ల‌కు 1 ప‌ర్సంట్ యూనివ‌ర్స‌ల్ అన్‌లిమిటెడ్ క్యాష్ బ్యాక్ ల‌భిస్తుంది. దేశంలోనే ఈ త‌ర‌హా క్యాష్ బ్యాక్‌ను అందిస్తున్న మొద‌టి కార్డు ఇదే కావ‌డం విశేషం. కాగా ఈ కార్డును పొందేందుకు ఎలాంటి చార్జిలు లేవు. అలాగే ఇంట‌ర్నేష‌న‌ల్‌గా కూడా ఈ కార్డును వాడుకోవ‌చ్చు. ఇక ఈ కార్డును ఉప‌యోగించి ఏడాదికి రూ.50వేల‌కు పైగా వాడుకుంటే వార్షిక ఫీజు రూ.500 ల‌ను ర‌ద్దు చేస్తారు. ఈ కార్డుతో క‌స్ట‌మ‌ర్లు ప‌లు వ‌స్తువుల‌ను ఈఎంఐ విధానంలోనూ కొనుగోలు చేసే అవ‌కాశం క‌ల్పిస్తున్నారు. ఇక ఈ కార్డు కావాలంటే పేటీఎం క‌స్ట‌మ‌ర్లు పేటీఎం యాప్‌లో అప్లై చేయాల్సి ఉంటుంది.

Related posts

Leave a Comment