తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల

తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఈ సారి ఫలితాల్లో 92.43 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. గతం కంటే ఎనిమిది శాతం ఉత్తీర్ణత పెరిగింది. బాలుర కంటే బాలికలు స్వల్ప ఆధిక్యత సాధించారు.  బాలికలు 93.68శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలురు 91.18 శాతం మంది పాస్ అయ్యారు. 99.73 శాతంతో జగిత్యాల తొలిస్థానంలో నిలవగా, 83.09 శాతంతో హైదరాబాద్‌ చివరిస్థానంలో నిలిచింది. వరుసగా మూడోసారి జగిత్యాలకు మొదటిస్థానం దక్కింది. జూన్‌ 10 నుంచి టెన్త్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. మే 27 వరకు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు కట్టేందుకు గడువు విధించారు. ఫలితాలను విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి విడుదల చేశారు. 

Related posts

Leave a Comment