పవన్ కల్యాణే సీఎం అవుతాడేమో.. మెగాబ్రదర్ నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్ని కులాలను కలుపుకుంటూ వెళుతున్నారని మెగాబ్రదర్ నాగబాబు తెలిపారు. తమకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కానీ, వైసీపీ అధినేత జగన్ తో కాని ఎలాంటి శత్రుత్వం లేదని స్పష్టం చేశారు. ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగబాబు ఈ మేరకు స్పందించారు.

ఈ సందర్భంగా ‘జగన్ ను సీఎం కానివ్వను’ అని పవన్ కల్యాణ్ గతంలో చేసిన వ్యాఖ్యలను మీడియా ప్రస్తావించడంతో నాగబాబు మాట్లాడుతూ..‘కల్యాణ్ బాబు జగన్ ను సీఎం కానివ్వడు. చంద్రబాబునూ సీఎం కానివ్వడు’ అని తేల్చిచెప్పారు. పరిస్థితులు అనుకూలిస్తే పవన్ కల్యాణే సీఎం అవుతాడేమో అని వ్యాఖ్యానించారు.

Related posts

Leave a Comment