నా పేరు సీత‌.. నేను గీసిందే గీత‌.. ట్రైల‌ర్

కాజ‌ల్ అగ‌ర్వాల్ ప్ర‌ధాన పాత్ర‌లో తేజ తెరకెక్కిస్తున్న చిత్రం సీత. బెల్లంకొండ శ్రీనివాస్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్నారు. నాయిక ప్ర‌ధాన నేప‌థ్యంలో సాగే ఈ చిత్రాన్ని అనీల్ సుంక‌ర నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. తాజాగా చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో ‘నా పేరు సీత నేను గీసిందే గీత. ప్రాస బాగుంది కదా..’ అని కాజల్‌ చెప్పే డైలాగ్‌ విని.. ‘ఇది కంచుకే కంచులా ఉందిరా బాబూ..’ అంటూ తనికెళ్ల భరణి వణికిపోతూ అనడం ఆస‌క్తిని క‌లిగిస్తుంది. సోనూ సూద్‌ ప్రతినాయకుడి పాత్ర పోషించారు. ‘రావణాసురుడు సీతను ఎత్తుకెళ్లడం తప్పు కాదండి. రాముడి భార్యను ఎత్తుకెళ్లడం తప్పు అని ట్రైలర్‌ చివర్లో శ్రీనివాస్‌ చెబుతున్న డైలాగ్‌ హైలైట్‌గా నిలిచింది. ఇందులో మన్నారా చోప్రా మరో కథానాయికగా నటించారు. మే 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా విడుద‌లైన చిత్ర ట్రైల‌ర్ సినిమాపై ఆస‌క్తిని క‌లిగిస్తుంది. తేజ ఈ చిత్రంతో మ‌రో హిట్ కొడ‌తాడ‌ని అభిమానులు భావిస్తున్నారు.

Related posts

Leave a Comment