టీవీ9 రవిప్రకాశ్ పై ఫోర్జరీ కేసు నమోదు

టీవీ9 సీఈవో రవిప్రకాశ్ పై ఫోర్జరీ కేసు నమోదైంది. చానల్ నిర్వహణ తన ఇష్టారాజ్యంగా జరగాలన్న పంతంతో అలందా మీడియా యాజమాన్యానికి అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తూ, చివరకి ఓ కీలక ఉద్యోగి సంతకాన్ని ఫోర్జరీ చేసిన రవిప్రకాశ్‌ను ఆ సంస్థ సీఈవో పదవి నుంచి తొలగించింది. కంపెనీలో 90 శాతానికి పైగా వాటా ఉన్న కొత్త యాజమాన్యానికి ఆ కంపెనీ నిర్వహణలో అడుగడుగునా అడ్డుపడుతూ, కంపెనీల చట్టంలోని నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని కొత్త యాజమాన్యం ఆరోపించింది. మెజార్టీ వాటాదారుల హక్కులను అణగదొక్కే విధంగా కుట్రపూరిత చర్యలకు పాల్పడ్డారంటోంది అలందా మీడియా.

సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పీఎస్‌లో రవి ప్రకాష్‌పై ఫోర్జరీ కేసు నమోదైంది. ఐటీ యాక్ట్ 56, ఐపీసీ 406, 467 సెక్షన్ల కింద సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. తన సంతకం రవిప్రకాష్ ఫోర్జరీ చేశారని అలంద మీడియా కంపెనీ కార్యదర్శి కౌశిక్ రావు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రవిప్రకాష్‌ కోసం రెండు రోజులుగా తెలంగాణ పోలీసుల గాలిస్తున్నారు. రవిప్రకాష్‌ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇవాళ‌ టీవీ9 కార్యాలయంలోనూ, ర‌విప్ర‌కాశ్‌ నివాసంలోనూ సైబర్ క్రైం పోలీసులు సోదాలు చేశారు. కొద్ది రోజుల కిందట ఏబీసీఎల్ కార్పొరేషన్ నుంచి టీవీ9ను అలంద మీడియా టేకోవర్ చేసింది.

Related posts

Leave a Comment