నిప్పుల గుండం

రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతూనే ఉన్నది. బుధవారం నల్లగొండలో అత్యధికంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరో మూడు రోజులపాటు ఇదే రీతిన ఎండలు మండిపోతాయని హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వడగాడ్పులు వీస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఖమ్మంలో 44.8 డిగ్రీలు, హైదరాబాద్‌లో 42.2 డిగ్రీల ఉష్ణోగ్రత గరిష్ఠంగా నమోదైంది. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు 46.5 నుంచి 47 డిగ్రీలకు చేరుకోవచ్చని వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఉదయం పది గంటల నుంచే భానుడు ప్రతాపం చూపుతుండటంతో ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టాలంటేనే ఒకటికి రెండుసార్లు అలోచించాల్సిన పరిస్థితి. సాయంత్రం ఆరు గంటల వరకు ఎండ తీవ్రత తగ్గకపోవడం గమనార్హం. ఉక్కపోత చెమటతో ప్రజలు సతమతమవుతున్నారు. 

Related posts

Leave a Comment