ఫిదా పాటను 20 కోట్ల మంది చూశారు..

‘వచ్చిండే..మెల్లామెల్లగ వచ్చిండే..క్రీము బిస్కెట్ ఏసిండే..గమ్మున కూర్చొనీయడే..కుదురుగా నిల్చోనీయడే’ అంటూ ఫిదా చిత్రంలో వచ్చిన పాట ఏ రేంజ్ లో పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనసరం లేదు. సినిమా విడుదలై రెండేళ్లు కావొస్తున్నా ఈ సినిమాలోని పాటలకు మాత్రం ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. వచ్చిండే..మెల్లామెల్లగ వచ్చిండే పాటకు సాయిపల్లవి డ్యాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇపుడు ఈ పాట అరుదైన రికార్డును నమోదుచేసింది. యూట్యూబ్ లో ఈ పాటను రెండు వందల మిలియన్లు (20 కోట్లు)మందికి పైగా వీక్షించారు. సుద్దాల అశోక్ తేజ రాసిన ఈ పాటను శక్తికాంత్ కార్తీక్ కంపోజ్ చేయగా..మధుప్రియ పాడింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా బాక్సాపీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. వీడియో సాంగ్ మీ కోసం..

Related posts

Leave a Comment