త‌న కుమార్తె తొలి ఫోటో విడుద‌ల చేసిన కేజీఎఫ్ హీరో

కేజీఎఫ్ చిత్రంతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన క‌న్న‌డ స్టార్ హీరో యశ్ గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో తండ్రి ప్ర‌మోష‌న్ అందుకున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఆయ‌న త‌న కూతురి ఫోటోని సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ పాప‌కి అంద‌రి బ్లెస్సింగ్స్ కావాలని కోరాడు. య‌శ్ భార్య రాధిక పండిట్ కూడా త‌న కూతురిని ప్రపంచానికి ప‌రిచ‌యం చేసింది. ప్ర‌స్తుతం ఆ పాప ఫోటో సోష‌ల్ మీడియాని షేక్ చేస్తుంది. రాధిక,యశ్‌లు 2016లో బ్ర‌హ్మీస్‌-గౌడ సంప్ర‌దాయం ప్ర‌కారం వివాహం చేసుకోగా, డిసెంబ‌ర్ 2,2018న వారికి పండంటి బిడ్డ జ‌న్మించింది. రాధిక‌, య‌శ్‌లు టీవీ సీరియ‌ల్స్‌తో యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేయ‌గా, 2008లో మొగ్గిన మ‌సు అనే చిత్రంతో తొలిసారి వెండితెర‌కి ప‌రిచ‌యం అయ్యారు. డ్రామా, మిస్ట‌ర్ అండ్ మిసెస్ రామాచారి సంతు స్ట్రైట్ ఫార్వార్డ్ అనే చిత్రాల‌లో వారిరివురు క‌లిసి న‌టించారు.

Related posts

Leave a Comment