నోట్లు వెదజల్లి లక్షలు కొల్లగొట్టారు పట్టపగలు లూటీ

హైదరాబాద్‌లోని వనస్థలిపురం. మంగళవారం ఉదయం 10.20 గంటలు కావస్తున్నది. ఎప్పటిలాగే జనసంచారంతో రద్దీగా ఉన్న ఆ ప్రాంతానికి ఓ బ్యాంకు ఏటీఎంలో డబ్బు నింపేందుకు కస్టోడియన్ వ్యాన్ చేరుకున్నది. అందులోనుంచి ఇద్దరు కస్టోడియన్లు రూ.3 లక్షలను తీసుకొని ఏటీఎంలో నింపేందుకు ముందుకునడిచారు. వారు ఆ పనిలో ఉండగా.. వాహన డ్రైవర్ పక్కకు వెళ్లాడు. ఈలోపు ఏటీఎం కేంద్రం నుంచి వ్యాన్ వరకు రూ.500, 100 నోట్లు చల్లుకుంటూ వచ్చిన ఓ దుండగుడు.. వాహనంలోని సెక్యూరిటీగార్డు వద్దకు వెళ్లి డబ్బులు కిందపడి ఉన్నాయని చెప్పాడు. వెంటనే సెక్యూరిటీగార్డు హడావుడిగా వ్యాన్ దిగి.. డబ్బు ఏరుకుంటూ ఏటీఎం కేంద్రం వైపు వెళ్లాడు. తిరిగొచ్చేసరికి వాహనంలోని రూ.59 లక్షల నగదు ఉన్న డబ్బుపెట్టె మాయమైంది. క్షణాల వ్యవధిలో పక్కా స్కెచ్ ప్రకారం సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘరానా చోరీ నగరంలో కలకలం రేపింది. సిబ్బంది దృష్టిమరల్చిన దుండగులు.. కస్టోడియన్ వ్యాన్‌లోని పెట్టెను ఆటోలో వేసుకుని పరారయ్యారు.

Related posts

Leave a Comment