ప్రతి గింజకు మద్దతు ధర

రాష్ట్రంలో కోటీ 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు వీలుగా నీటిపారుదలరంగాన్ని అభివృద్ధిపరుస్తున్నామని, ఫలితంగా రాబోయే రోజుల్లో పంటల దిగుబడులు భారీగా పెరుగుతాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు. అందుకు తగినట్లుగా రైతులకు కనీస మద్దతు ధర కల్పించేలా అవసరమైన వ్యూహం ఖరారుచేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి గింజకు మద్దతు ధర.. లాభసాటి సాగు మన లక్ష్యమని చెప్పారు. రైతులకు కనీస మద్దతు ధర కల్పించే వ్యూహాన్ని రూపొందించేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మంగళవారం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ, ఉద్యానవన, మార్కెటింగ్‌, పౌరసరఫరాలు తదితర శాఖలన్నీ సమన్వయంతో వ్యవహరించి , రైతులకు కనీస మద్దతు ధర కల్పించి, వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. దీనికోసం తెలంగాణ రాష్ట్రంలోని ప్రజల ఆహార అవసరాలేమిటి? ఏది ఎంత తింటున్నారు? ఎంత పండిస్తున్నారు? ఎంత దిగుబడి చేసుకుంటున్నారు? ఎంత ఎగుమతి చేస్తున్నారు? తదితర అంశా ల్లో ఖచ్చితమైన గణాంకాలు రూపొందించాలని ఆదేశించారు.

Related posts

Leave a Comment