నైరుతిలో మంచి వానలు

దేశ వ్యాప్తంగా ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదు కానుందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. రుతుపవనాలు సకాలంలోనే ప్రవేశిస్తాయని శుభవార్త చెప్పింది. జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు 96శాతం వర్షపాతం నమోదు కానుందని తెలిపింది. ప్రస్తుతం పసిఫిక్‌ మహాసముద్రంలో ఉన్న ఎల్‌నినో నైరుతి సీజన్‌ రెండో భాగానికి మరింత బలహీనపడుతుందని అంచనా వేసింది. బలహీన ఎల్‌నినో పరిస్థితులు ఈ వేసవి అంతా కొనసాగనున్నాయని, దీంతో ఆసియా పసిఫిక్‌ దేశాల్లో తక్కువ వర్షపాతం కురుస్తుందని అంతర్జాతీయ వాతావరణ సంస్థలు అంచనా వేశాయి. ఐఎండీ మాత్రం ఆ ప్రభావం భారత్‌పై ఉండదని తేల్చిచెప్పింది. వేసవి తర్వాత ఎల్‌నినో బలహీనపడుతుందని స్పష్టం చేసింది. గతేడాది మంచి వర్షాలు కురుస్తాయన్న అంచనాకు భిన్నంగా 91శాతం వర్షపాతమే నమోదైంది. ముఖ్యంగా దక్షిణాదిలో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఈసారి దేశంలో సాధారణ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. నైరుతి రుతుపవనాల సీజన్‌పై తొలిదశ నివేదికను ఐఎండీ సోమవారం విడుదల చేసింది.

Related posts

Leave a Comment