త్వరలోనే బద్దలవుతుంది: విజయశాంతి

రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేస్తానన్న సీఎం కేసీఆర్‌ ప్రకటన వెనుక రాజకోట రహస్యం దాగి ఉందని, అది త్వరలోనే బద్దలవుతుందని కాంగ్రెస్‌ నాయకురాలు విజయశాంతి వ్యాఖ్యానించారు. రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేస్తానని కేసీఆర్‌ చెప్పడం విడ్డూరంగా ఉందంటూ విజయశాంతి సోమవారం తన ఫేస్‌బుక్‌లో ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రెండేళ్ల క్రితం రాష్ట్రాన్ని కుదిపేసిన మియాపూర్‌ భూకుంభకోణం వెలుగు చూసినప్పుడే రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేస్తానని కేసీఆర్‌ ప్రకటనలు గుప్పించారని, అందులో టీఆర్‌ఎస్‌ బడా నేతలకు సంబంధాలు ఉన్నాయని తేలడంతో ప్రక్షాళన అంశాన్ని అటకెక్కించారన్నారు. ఆ ఘటనలో కే కేశవరావు వంటి బడుగు నేతను బలి చేసి తనకు సన్నిహితులైన వారిని కేసీఆర్‌ సర్కారు కాపాడిందన్నారు. అప్పుడే రెవెన్యూ ప్రక్షాళన చేసి ఉంటే బాగుండేదని ఆమె అభిప్రాయపడ్డారు.

Related posts

Leave a Comment