కమనీయంగా సీతారాముల కల్యాణం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఆదివారం శ్రీసీతారాముల కల్యాణం కనుల పండువగా జరిగింది. దేశం నలుమూలల నుంచి తరలివచ్చిన లక్షలాది భక్తులు స్వామివారి కల్యాణాన్ని కనులారా తిలకించారు. దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి రాష్ట్రప్రభుత్వం తరఫున పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ముందుగా రామాలయాన్ని సందర్శించిన మంత్రి.. అక్కడ పూజల అనంతరం కల్యాణ మండపానికి చేరుకొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్.. కుటుంబం తరపున వ్యక్తిగతంగా సీతారామచంద్రస్వామివారికి పట్టువస్ర్తాలను పంపించారు. ఈ పట్టువస్ర్తాలను దేవాదాయశాఖ కమిషనర్ అనిల్‌కుమార్ అందజేశారు. త్రిదండి చినజీయర్‌స్వామి, తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీరంగక్షేత్రం, శృంగేరి పీఠం నుంచి స్వామివారికి పట్టువస్ర్తాలు, శేషమాలికలు, పవిత్రాలు పంపించారు. రామదాసు వంశం పదోతరంగాఉన్న కంచర్ల శ్రీనివాస్ దంపతులు స్వామివారికి పట్టువస్ర్తాలు అందజేశారు. 

Related posts

Leave a Comment