కేసీఆర్ ను కడిగేసే దమ్ము పవన్ కు మాత్రమే ఉందా?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఒక మాట అనాలంటే అందుకు నాలుగైదు గుండెలు కావాల్సిందే. ఎవరు అవునన్నా.. కాదన్నా అది నిజం. గతాన్ని గుర్తు చేసుకుంటే తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన్ను ఉద్దేశించి ఏ చిన్న విమర్శ చేయటానికి తోపుల్లాంటి నేతలు సైతం కిందామీదా పడేటోళ్లే తప్పించి గట్టిగా ఒక విమర్శ చేయటానికి వెనుకాడేవారు. ఎందుకంటే.. కేసీఆర్ ను అంటే తెలంగాణ సెంటిమెంట్ ను దెబ్బ తీసినట్లుగా నేతల్లో భావన ఉండేది. నిజానికి కేసీఆర్ వేరు.. తెలంగాణ సెంటిమెంట్ వేరన్న విషయాన్ని పోటుగాళ్లుగా చెప్పుకునే ఏ తెలంగాణ నేత వేరు చేసి కేసీఆర్ ను మాటలతో ఉతికి ఆరేసినోళ్లు లేరు.

కేసీఆర్ వ్యూహంలో నేతలు చిక్కుకోవటమే కానీ.. ఆయన్ను తమ వ్యూహంలో పడేలా చేసిన తెలివి ఏ నేతకు లేదని చెప్పాలి. అది చంద్రబాబు కావొచ్చు.. వైఎస్ జగన్ కావొచ్చు.. మరెవరైనా కావొచ్చు. కానీ.. అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ కొత్త తరహా అనుభవాన్ని తెలుగు ప్రజలకు పంచుతున్న ఏకైక నేతగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను చెప్పాలి.

Related posts

Leave a Comment