మోదీ కరడుగట్టిన ఉగ్రవాది.. మంచివాడు కాదు: చంద్రబాబు

ఏడాది కిందటి వరకు కూడా ప్రధాని నరేంద్ర మోదీతో చెట్టాపట్టాలేసుకొని తిరిగిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎన్నికల సభల్లో మోదీపై ఘాటైన విమర్శలు చేస్తున్నారు. తాజాగా నరేంద్ర మోదీ ఓ కరడు గట్టిన ఉగ్రవాది అని, మంచివాడు కాదు అని అనడం విశేషం. చిత్తూరు జిల్లా మదనపల్లె ఎన్నికల సభలో బాబు చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ సభలో ఎప్పుడో జరిగిన గోద్రా అల్లర్ల అంశాన్ని కూడా మరోసారి గుర్తు చేశారు. మైనారిటీ సోదరులకు ఒక్కటే చెబుతున్నా. మిమ్మల్ని జైళ్లలో వేయడానికి మోదీ ట్రిపుల్ తలాఖ్ బిల్లు తీసుకొచ్చారు. గోద్రా ఘటన మీకు గుర్తుండే ఉంటుంది. 2 వేల మందిని చంపారు. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న మోదీని రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన తొలి వ్యక్తిని నేనే అని చంద్రబాబు చెప్పడం గమనార్హం. ఆయన మళ్లీ అధికారంలోకి వస్తే మీకు కష్టాలు తప్పవంటూ మైనారిటీలను బాబు హెచ్చరించారు. 2014లో మోదీతో చేతులు కలిపి ఏపీలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఆ తర్వాత రాష్ర్టానికి హోదా ఇవ్వకుండా బీజేపీ మోసం చేసిందంటూ ఎన్డీయే ప్రభుత్వం నుంచి బయటకు వచ్చిన విషయం తెలిసిందే.

Related posts

Leave a Comment