కాబోయే ప్రధాని కేసీఆర్

దేశానికి కాబోయే ప్రధానమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. కేంద్రంలో ఏర్పడబోయేది కొత్త కూటమేనని పేర్కొన్నారు. బాలాపూర్ మండల పరిధిలోని షాహిన్‌నగర్ జెన్‌జెన్ మేకరి కాలనీలో టీఆర్‌ఎస్, ఎంఐఎం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సభలో, సికింద్రాబాద్ అభ్యర్థి సాయికిరణ్‌యాదవ్‌కు మద్దతుగా ఎర్రగడ్డ సుల్తాన్‌నగర్‌లో నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌కు ప్రధాని మోదీ రూపాయి కూడా ఇవ్వలేదని, ప్రజలను ద్వేషపూరిత వ్యాఖ్యలతో రెచ్చగొడుతున్నారని విమర్శించారు. కేసీఆర్‌కు ప్రధాని మోదీకి నింగికీ నేలకు ఉన్నంత వ్యత్యాసం ఉన్నదన్నారు. 

Related posts

Leave a Comment