‘ఛోటి ఛోటి బాతే..’తో ఆకట్టుకుంటున్న ‘మహర్షి’

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు హీరోగా.. సూపర్‌హిట్‌ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, వైజయంతి మూవీస్‌, పీవీపీ సినిమా పతాకాలపై హై టెక్నికల్‌ వేల్యూస్‌తో రూపొందుతోన్న భారీ చిత్రం ‘మహర్షి’. మహేష్‌ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. అల్లరి నరేష్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. సూపర్‌స్టార్‌ మహేష్‌కు ఇది 25వ చిత్రం కావడం విశేషం.

ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రం నుంచి ‘ఛోటి ఛోటి బాతే.. మీటి మీటి మీటి యాదే..’ సాంగ్ రిలీజ్ అయింది. మహేష్, పూజా, అల్లరి నరేష్ స్నేహాన్ని వర్ణిస్తున్న ఈ సాంగ్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. రాక్ స్టార్ దేవిశ్రీ అందించిన ఈ సాంగ్ యూత్‌ని బాగా ఆకట్టుకుంటుందనడంలో సందేహం లేదు.

Related posts

Leave a Comment