మహేష్ బాబుతో మహేష్ సెల్ఫీ.. ఆసక్తిగా చూస్తున్న ఫ్యాన్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు, సినీ ప్రియులు ఎంతగానో ఎదురు చూసిన తరుణం రానే వచ్చింది. మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం వారు రూపొందించిన మహేష్ బాబు మైనపు విగ్రహాన్ని హైదరాబాద్ తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ విగ్రహం హైదరాబాద్ లోని ఏఎంబీ సినిమాస్ మల్టిప్లెక్స్‌లో అభిమానులు, మీడియా సందర్శనార్థం ఉంచారు. కొద్ది సేపటి క్రితమే విగ్రహ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి మహేష్ ఫ్యాన్స్ పెద్దఎత్తున తరలి వచ్చి వీక్షించారు. విగ్రహావిష్కరణకు వచ్చిన సూపర్ స్టార్.. తన మైనపు బొమ్మతో సెల్ఫీ దిగుతూ సందడి చేశారు. మైనపు బొమ్మ పక్కన మహేష్ నిల్చొని అచ్చం అదే స్టిల్‌తో ఫోజులిచ్చారు. అయితే ఇద్దరు మహేష్‌లను ఒక్కచోట చూసిన అభిమానులు ఇంతకీ ఎవరు నిజం, ఎవరు విగ్రహం అనేది అర్థంకాక తికమక పడుతున్నారు.

ఈ విగ్రహాన్ని ఒక్క రోజు (సోమవారం -మార్చి 25) మాత్రమే ఇక్కడ ఉంచి.. మరుసటి రోజు సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంకు తరలించనున్నారు. మేడమ్ టుస్సాడ్స్ వారు సింగపూర్‌లో కాకుండా బయటి ప్రాంతంలో ఇలా విగ్రహాన్ని ప్రదర్శించడం, ఇంత గొప్ప కార్యక్రమం చేయడం ఇదే మొదటిసారి.

Related posts

Leave a Comment