“నేనే మొదలు పెట్టాను .. నేనే పూర్తి చేస్తాను” నయనతార ‘ఐరా’ నుంచి ట్రైలర్ రిలీజ్

తమిళంలో నయనతార చేసిన సస్పెన్స్ తో కూడిన హారర్ థ్రిల్లర్ సినిమాలు అక్కడ భారీ విజయాలను సాధించాయి. ఆ సినిమాలు తెలుగు ప్రేక్షకులను సైతం ఎంతగానో ఆకట్టుకున్నాయి. అలా మారో హారర్ థ్రిల్లర్ సినిమాతో అటు తమిళ ప్రేక్షకులను .. ఇటు తెలుగు ఆడియన్స్ ను పలకరించడానికి నయనతార సిద్ధమైంది. ఆమె ప్రధాన పాత్రధారిగా చేసిన ఆ సినిమాయే ‘ఐరా’.

తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. దెయ్యాలు ఉన్నాయని నమ్మించడానికి ప్రయత్నించిన నయనతార .. ఎలాంటి ఇబ్బందుల్లో పడిందనే కథాంశంతో ఈ కథ కొనసాగుతుందని ఈ ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది. “ఈ లోకంలో ఎవరూ ఇవ్వని సంతోషాన్ని నువ్వు నాకు ఇచ్చావు అభి .. దానిని దూరం చేసిన ఎవరినీ నేను ప్రాణాలతో వదలను”.. “నేనే మొదలు పెట్టాను .. నేనే పూర్తి చేస్తాను” వంటి డైలాగ్స్ సినిమాపై ఉత్కంఠను పెంచుతున్నాయి. నయనతార ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమా, తమిళంతో పాటు తెలుగులోనూ ఈ నెల 28వ తేదీన విడుదల కానుంది.

Related posts

Leave a Comment