పూజా కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న కేజీఎఫ్ 2

KGF-2

క‌న్న‌డ సినీ ఇండ‌స్ట్రీలో అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ సాధించిన చిత్రంగా రికార్డులు పొందిన మూవీ కేజీఎఫ్‌. పీరియ‌డ్ గ్యాంగ్ స్ట‌ర్ డ్రామాగా తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని తెలుగు, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల‌లో విడుద‌ల చేశారు. అంత‌టా ఈ చిత్రానికి భారీ ఆద‌ర‌ణ ల‌భించింది. శాండ‌ల‌వుడ్ చ‌రిత్రలో సరికొత్త రికార్డు నెల‌కొల్పిన ఈ చిత్రానికి సీక్వెల్ ప్రారంభ‌మైంది. తాజాగా బెంగ‌ళూర్ లోని విజ‌య‌న‌గ‌ర్ ప్రాంతంలో ఉన్న‌ కొండండ్రం గుడిలో సీక్వెల్ చిత్రానికి పూజా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి న‌టుడు య‌శ్‌తో పాటు శ్రీనిధి శెట్టి, ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్‌, త‌దితరులు హాజ‌ర‌య్యారు. అతి త్వ‌ర‌లోనే ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్ళాల‌ని మేక‌ర్స్ అనుకుంటున్నార‌ట‌.

కర్ణాటక రాష్ట్రంలో జరిగిన అక్రమ మైనింగ్‌ నేపథ్యంలో కేజీఎఫ్ చిత్రాన్ని తెరకెక్కించారు. యువ నటుడు యష్‌ ఈ చిత్రంలో హీరోగా నటించారు. సీక్వెల్‌లోను ఆయ‌న హీరోగా న‌టించ‌నున్నాడు. ముఖ్య పాత్ర‌ల‌లో ర‌మ్య‌కృష్ణ‌, సంజ‌య్ ద‌త్‌ని తీసుకోవాల‌ని చిత్ర యూనిట్ భావిస్తుంద‌ట‌. ఇక మొదటిభాగంలో చేసిన రవిశంకర్ .. అదే పాత్రలో రెండవ భాగంలోను కొనసాగుతాడట. కాకపోతే అత‌ని పాత్ర‌ని మ‌రింత ప‌వ‌ర్‌ఫుల్‌గా రూపొందించ‌నున్నార‌ట‌. ఇక బాలీవుడ్‌ నటి రవీనా టాండన్‌, క‌న్న‌డ రియ‌ల్ స్టార్ ఉపేంద్ర‌ కూడా ఇందులో నటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావల్సి ఉంది.

Related posts

Leave a Comment