హీరో అవ్వడమే ఒక బోనస్!!

Sharwanand-Birthday

మనిషిగా పుట్టడమే బోనస్ అనుకుంటే.. హీరో అవ్వడం డబుల్ బోనస్!! టాలీవుడ్ కి చెందిన ఓ ప్రముఖుడు ఓ సందర్భంలో చెప్పిన మాట ఇది. హీరోకి ఉండే క్రేజు అలాంటిది. జన్మ ఒక్కటే అనుకుంటే అందులో హీరో అయ్యే అవకాశం కూడా ఒక్కటే. అందుకే ఫేజ్ 3 యూత్ చాలా మంది వన్ ఫిలిం వండర్ అయినా అవ్వాలనుకుంటారు. నవతరం హీరోల్లో ట్యాలెంటెడ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న శర్వానంద్ అసలు హీరో అవ్వాలనుకున్నాడా? అంటే.. ఆరంభం ఆ ఆలోచన లేకపోయినా.. తనకు ఉన్న ఫేజ్3 కనెక్షన్ దృష్ట్యా హీరో అవ్వాలనుకున్నాడు. అయ్యాడు. అటుపై కెరీర్ పరంగా కొన్ని ఒడిదుడుకులు ఎదురైనా నెమ్మదిగా నిలదొక్కుకోగలిగాడు. ఫ్యామిలీ ఆడియెన్ మనసు దోచిన యువహీరోగా గుర్తింపు దక్కించుకున్నాడు.

Related posts

Leave a Comment