మే 9వ తేదీన రానున్న ‘మహర్షి’?

మహేశ్ బాబు .. వంశీ పైడిపల్లి కాంబినేషన్లో ‘మహర్షి’ రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమాను ఏప్రిల్ 25వ తేదీన విడుదల చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఆ రోజున ఈ సినిమా థియేటర్లకు రాకపోవచ్చనే ప్రచారం జరుగుతూ ఉండటంతో, ఏప్రిల్ 25 నే ఈ సినిమా వస్తుందని స్పష్టం చేశారు.

కానీ ఈ సినిమాను మే 9వ తేదీన విడుదల చేయలనే నిర్ణయానికి దర్శక నిర్మాతలు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఏప్రిల్ 13 వరకూ షూటింగ్ జరుగుతూనే ఉండాలి .. అందువలన ఏప్రిల్ 25 విడుదల సాధ్యం కాదు. ఈ విషయాన్ని మహేశ్ కి చెప్పి ఆయనను ఒప్పించే పనిలోనే దిల్ రాజు వున్నట్టుగా సమాచారం. మే నెల సినిమాల విడుదల పరంగా తనకి అచ్చిరాదనే సెంటిమెంట్ మహేశ్ బాబుకి వుంది. మే 9వ తేదీన రిలీజ్ అంటే మరి ఆయన ఎలా స్పందిస్తాడో చూడాలి.

Related posts

Leave a Comment