చంద్రబాబు మీద కక్షతో కొడుకుని జగన్ కాళ్లపై పడేశారు: దగ్గుబాటిపై వర్ల విసుర్లు

varla-ramaiah

దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన భార్య పురందేశ్వరిలపై టీడీపీ నేత వర్ల రామయ్య మండిపడ్డారు. తోడల్లుడు చంద్రబాబు అంటే దగ్గుబాటికి ఈర్ష్య అని అన్నారు. చంద్రబాబు సీఎం కావడంతో దగ్గుబాటికి నిప్పుల కుంపటి మీద కూర్చున్నట్టు ఉందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మీద కక్షతోనే వైసీపీ అధినేత జగన్ కాళ్లపై తన కొడుకును పడేశారని విమర్శించారు. చంద్రబాబు వింతజీవి అంటున్నారని… వింతజీవి ఎలాగో చెప్పాలని అన్నారు. దగ్గుబాటి, పురందేశ్వరిలు దిగజారుడు రాజకీయాలు మానుకోవాలంటూ హితవు పలికారు.

Tags: Chandrababu, Jagan, Daggubati

Related posts

Leave a Comment