‘కాంచన 3’ మోషన్‌ పోస్టర్‌కు విశేష స్పందన

సన్‌పిక్చర్స్‌ సమర్పణలో రాఘవేంద్ర ప్రొడక్షన్స్‌ బ్యానరుపై లారెన్స్‌ స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘కాంచన 3’. ఈ సినిమా మోషన్‌ పోస్టర్‌ను సంక్రాంతి కానుకగా విడుదల చేశారు. విడుదలైన ఒక్క రోజులోనే ఏకంగా రెండు మిలియన్ల మంది చూసినట్లు చిత్రవర్గాలు అధికారికంగా ప్రకటించాయి. మరికొన్ని రోజుల్లో పది లక్షల వ్యూస్‌ను తాకుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై లారెన్స్‌ స్పందిస్తూ ‘నా అభిమానులు మాత్రమే కాకుండా మిగిలిన హీరోల అభిమానులు కూడా ఈ మోషన్‌ పోస్టర్‌ను చూసి అభినందిస్తున్నారు. అందరికీ మనసారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. వేసవి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం’ అని పేర్కొన్నారు. ఇందులో ఓవియా, వేదికలు కథానాయికలుగా నటిస్తున్నారు. కోవై సరళ, కదిర్‌, మనోబాలా, శ్రీమన్‌, సత్యరాజ్‌, కిశోర్‌ తదితరులు నటిస్తున్నారు.

Related posts

Leave a Comment