రిజర్వేషన్లు లేకుండానే ఆమె రాణించారు

indira-nitin

మాజీ ప్రధాని ఇందిరాగాంధీపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రశంసల వర్షం కురిపించారు. రిజర్వేషన్ల అవసరం లేకుండానే ఇందిరా గాంధీ తన ప్రతిభను నిరూపించుకున్నారని, పురుష నాయకుల కంటే ఆమె ఎంతో గొప్పగా పనిచేశారని కొనియాడారు. మహిళా రిజర్వేషన్లను తాను వ్యతిరేకించడం లేదని, కుల, మతాల ఆధారంగా రాజకీయాలు చేయడాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నానని గడ్కరీ స్పష్టం చేశారు. ఆదివారం ఆయన నాగ్‌పూర్‌లో మహిళా స్వయంశక్తి సంఘాల ఎగ్జిబిషన్‌ను ప్రారంభిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎమర్జెన్సీని విధించినందుకు ఇందిరా గాంధీని బీజేపీ విమర్శిస్తుంటే.. మరో వైపు గడ్కరీ ఆమెను ప్రశంసించడం చర్చనీయాంశమయింది. కాంగ్రెస్ పార్టీలో ఇందిరా గాంధీ తన ప్రతిభను నిరూపించుకుని అంకితభావం కలిగిన పురుషుల కంటే ఎంతో గొప్పగా పనిచేశారు. ఇందుకు రిజర్వేషన్లు కారణమా? కేంద్ర మంత్రి సుష్మ స్వరాజ్, రాజస్థాన్ మాజీ సీఎం వసుంధర రాజే, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ లాంటి బీజేపీ నాయకులు కూడా రిజర్వేషన్ల అవసరం లేకుండానే చక్కగా రాణిస్తున్నారు. మహిళలకు రిజర్వేషన్లు కల్పించాల్సిందే. దాన్ని నేను వ్యతిరేకించడం లేదు అని గడ్కరీ పేర్కొన్నారు. ఎవరైనా తెలివితేటలతోనే రాణించగలుగుతారని, కులం, మతం, భాష, ప్రాంతం ఆధారంగా ఎవరూ రాణించలేరని అన్నారు.

Related posts

Leave a Comment