APPSC Recruitment Notification: ఏపీలో కొలువుల జాతర.. త్వరలో మరో 14 నోటిఫికేషన్లు

APPSC Recruitment Notification-s9Tv

ఆంధ్రప్రదేశ్‌లో కొలువుల జాతర కొనసాగుతోంది. ఇప్పటికే 21 నోటిఫికేషన్ల ద్వారా 3,225 పోస్టుల్ని భర్తీ చేస్తున్న ఏపీపీఎస్సీ.. తాజాగా మరికొన్ని నోటిఫికేషన్లకు సిద్ధమవుతోంది. ఈ నెలాఖరు లోపు 1500 ఉద్యోగాల భర్తీకి 14 నోటిఫికేషన్లు విడుదల చేసే అవకాశం ఉందంటున్నారు ఏపీపీఎస్సీ ఛైర్మన్ ఉదయ్ భాస్కర్. నోటిఫికేషన్లలోనే స్క్రీనింగ్‌ టెస్ట్‌, మెయిన్స్‌ పరీక్ష షెడ్యూల్‌తో పాటు ఖాళీల వివరాలను భిన్నంగా క్యారీ ఫార్వర్డ్‌ పోస్టుల వివరాలతో సహా పొందుపరిచామన్నారు.

గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుందన్నారు ఉదయ్ భాస్కర్. పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలకు ఈ నెల 19 వరకు దరఖాస్తులకు గడువు ఉందని.. ఆ పోస్టులకు మొత్తం 56,621 దరఖాస్తులు వచ్చాయన్నారు. పోస్టులకు చివరి నిమిషంలో దరఖాస్తులు చేయడం వల్ల సర్వర్‌లో సాంకేతిక ఇబ్బందులు వస్తున్నాయని.. అభ్యర్థులు వీలైనంత త్వరగా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ಓటీపీఆర్ లో అప్లై చేసుకొని కోడ్ నెంబర్ లను అభ్యర్థులు మరచిపోవడం ద్వారానే ఈ ఇబ్బందులు వస్తున్నాయంటున్నారు.

Related posts

Leave a Comment