దేవుళ్లకు చలేస్తుందని వేడినీళ్లతో అభిషేకం…!

The Ayodhya temple has installed heaters so that the gods don't get cold

ఉత్తరాదిలో ఎముకలు కొరికే చలికి కారణంగా అక్కడి ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరీ, దేవుళ్ల సంగతి ఏంటి? చలికి వారు కూడా గజగజ వణికిపోరా! దేవతా విగ్రహాలకు చన్నీళ్లతో అభిషేకం చేస్తే చలికి ఇబ్బంది పడరు? చలికి వణికి పోకుండా గర్భగుడిలో హీటర్లు ఏర్పాటు చేయొద్దు?.. ఈ ఏర్పాట్లన్నీ అయోధ్యలోని ఓ ఆలయంలో చేయడం గమనార్హం. దేవుళ్లకు చలేస్తుందని చెప్పి జానకి ఘాట్ బడాస్థాన్ ఆలయంలోని గర్భగుడిలో హీటర్లు ఏర్పాటు చేయగా, విగ్రహాలకు అభిషేకం చేసేందుకు వేడినీళ్లు ఉపయోగిస్తున్నారు.
దేవుళ్లకి కూడా చలేస్తుందని చెప్పి ఈ ఏర్పాట్లన్నీ చేశామని ఆలయ వేదపండితుడు జన్మయ్ షరన్ మీడియాకు తెలిపారు. కాగా, రెండు రోజుల క్రితం అయోధ్యలోని రామలల్లా విగ్రహానికి నూలు దుస్తులు వేయాలని, ఆలయంలో హీటర్లు పెట్టించాలని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్ పీ) డిమాండ్ చేసింది.

TAGS: Heater, installed to keep, gods warm at temple, in wintry, Ayodhya,

Related posts

Leave a Comment