కోల్ కతాలో మూడుకు చేరిన కరోనా బాధితుల సంఖ్య

భారత్ లోనూ (కోవిడ్-19) కరోనా వైరస్ బాధితుల సంఖ్య క్రమేపి పెరుగుతోంది. కోల్ కతా లో మూడో కరోనా కేసు నమోదైంది. నగరంలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో మరో వ్యక్తికి నావల్ కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ చేశారు. ఈ మేరకు విమానాశ్రయా అధికారులు ఒక ప్రకటన చేస్తూ.. బ్యాంకాక్ నుంచి కోల్ కతా చేరుకున్న ప్రయాణికుడికి పరీక్షలు చేయగా కరోనా వైరస్ పాజిటివ్ గా తేలిందని తెలిపారు. ఈ తాజా కేసుతో కోల్ కతాలో కరోనా సోకిన వారి సంఖ్య మూడుకు చేరింది. ఈ వారంలో హిమాద్రి బార్మాన్, నాగేంద్ర సింగ్ అనే ఇద్దరు ప్రయాణికులకు పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ గా తేలారని చెప్పారు. పాజిటివ్ గా తేలిన వారిని బలియాఘటా ఐడి అస్పత్రికి పంపినట్లు అధికారులు వెల్లడించారు.…

Read More

సీరియల్ నటి దారుణ హత్య… పది రోజుల తర్వాత వెలుగులోకి…

ఓ సీరియల్ నటిని తన భర్త దారుణంగా హత్య చేశాడు. తన మిత్రుడితో కలసి ఆమెను అంతం చేశాడు. అనంతరం ఆమె శవం కూడా కనిపించకుండా ఉండేందుకు పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. ఢిల్లీకి చెందిన అనిత సీరియల్ నటి. పలు టీవీ షోల్లో నటిస్తూ ఉంటుంది. అయితే, ఆమెకు ఓ యువకుడితో వివాహేతర సంబంధం ఉందని ఆమె భర్త రవీంద్రపాల్ అనుమానం. ఈ క్రమంలో తన భార్యను చంపాలని అతడు పథకం పన్నాడు. జనవరి 30న ఆమెను తీసుకుని బస్సులో వెళ్లాడు. తనకు తెలిసిన ఓ ఫ్రెండ్ ఉన్నాడని, అతడు ముంబైలో టీవీ ఆర్టిస్టులకు ట్రైనింగ్ ఇస్తుంటాడని చెప్పాడు. అతడిని కలిస్తే టీవీ సీరియల్స్‌లో మంచి అవకాశాలు రావడంతో పాటు, కెరీర్ బాగా పుంజుకుంటుందని ఆమెను నమ్మించాడు. భర్త చెప్పిన మాటలు విన్న అనిత అతడితో కలసి…

Read More

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారు..?

ap-assembly

దీలు ఖరారైనట్టు తెలుస్తోంది. మార్చి 15 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నట్టు సమాచారం. నెల రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. సమావేశాలు ప్రారంభమైన వారం, పది రోజుల్లోనే బడ్జెట్‌ను ప్రవేశపెట్టి, ఆమోదింపజేసుకుని ఆ తర్వాత ఇతర బిల్లులను సభ ముందుకు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లుల మీద ఎలాంటి అడుగులు వేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సవరణలకు బీజం వేస్తూ పంచాయతీరాజ్ బిల్లుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలుపనుంది. వ్యవసాయ మండలి ముసాయిదా బిల్లుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలుపనుంది. గత నెలలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది. రాజధాని – అభివృద్ది వికేంద్రీకరణతో పాటు సీఆర్డీఏ రద్దు బిల్లులను ప్రవేశపెట్టింది. అయితే, శాసనసభ ఆమోదం పొందిన…

Read More

రెండో పెళ్లి చేసుకోబోతున్న దిల్ రాజు

టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు రెండో పెళ్లి చేసుకుంటున్నారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. కొన్ని రోజుల నుంచి ఈ వార్తలు వినిపిస్తున్నప్పటికీ… వీటిని ఇంత వరకు ఎవరూ ఖండించలేదు. అయితే ఆయన రెండో పెళ్లికి సంబంధించి ఈరోజు మరో అప్ డేట్ వచ్చింది. ఈ నెల 15న పెళ్లి జరగబోతోందనే వార్త ఇప్పుడు సంచలనం రేపుతోంది. దిల్ రాజు చేసుకోబోయే అమ్మాయి ఆయనకు చాలా కాలంగా తెలుసని చెబుతున్నారు. గతంలో ఆమె ఎయిర్ హోస్టెస్ పని చేసిందని ఒక వార్త, ‘జోష్’ సినిమాలో రోల్ కోసం వచ్చిన అమ్మాయి అని మరో వార్త వినిపిస్తున్నాయి. చాలా కాలంగా ఇద్దరూ సన్నిహితంగా ఉంటున్నారని చెబుతున్నారు. దిల్ రాజు వయసు 50లలో ఉండగా… పెళ్లి కూతురు వయసు 30 ఏళ్లని అంటున్నారు. మూడేళ్ల క్రితం దిల్ రాజు భార్య…

Read More

కాళేశ్వరం ముక్తేశ్వర స్వామికి సీఎం కేసీఆర్‌ అభిషేకం

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర క్షేత్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సందర్శించారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ముక్తేశ్వర స్వామికి సీఎం కేసీఆర్‌ అభిషేకం నిర్వహించి, ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు సీఎం కేసీఆర్‌ను ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్‌ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అంతకుముందు పుష్కరఘాట్‌లో గోదావరిమాతకు సీఎం కేసీఆర్‌ పూజలు చేశారు. గోదావరిలో నాణేలు వదిలిన కేసీఆర్‌.. చీర, సారె సమర్పించారు. సీఎం కేసీఆర్‌ వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, మంత్రులు ఈటల రాజేందర్‌, గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు ఉన్నారు. మరికాసేపట్లో లక్ష్మీబరాజ్‌ను సీఎం కేసీఆర్‌ సందర్శించనున్నారు. అనంతరం కరీంనగర్‌లోని తీగలగుట్టపల్లికి చేరుకుంటారు సీఎం కేసీఆర్‌. Tags : CM KCR , Kaleshwaram , laxmi barrage , Mukteswara swamy…

Read More