బాలికపై లైంగిక వేధింపులు.. బాలీవుడ్ నటుడిపై కేసు నమోదు

బాలికను లైంగికంగా వేధించాడంటూ బాలీవుడ్ నటుడు షహ్బాజ్ ఖాన్ పై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. ముంబైలోని ఓషివారా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఐపీసీ సెక్షన్లు 354, 509 కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోందని ఈ సందర్భంగా పోలీసులు తెలిపారు. షహ్బాజ్ ఖాన్ పలు బాలీవుడ్ సినిమాలు, టీవీ షోలతో పాటు ఒక చైనీస్ సినిమాలో నటించాడు. వీటితో పాటు పంజాబీ, గుజరాతీ, కన్నడ సినిమాల్లో కూడా నటించాడు. పద్మభూషణ్ పురస్కార గ్రహీత ఉస్తాద్ ఆమిర్ ఖాన్ కుమారుడే షహ్బాజ్ ఖాన్. Tags : Shahbaz Khan , Bollywood , Case , Molesting

Read More

నెల్లూరులో నర్సుకు వేధింపులు… ఆమ్లేట్ వేసుకొని రాత్రి రమ్మన్న డాక్టర్

ఎన్ని చట్టాలు తీసుకువస్తున్న ఆడవారిపై వేధింపులు మాత్రం ఆగడంలేదు. బస్సుల్లోనే, స్కూళ్లలోనే, పనిచేేేసే ఆఫీసుల్లోనూ.. ఆడవారికి లైంగిక వేధింపులు తప్పడం లేదు. తాజాగా మరొ ఘటన వెలుగులోకి వచ్చింది. నెల్లూరులో నలుగురికి సేవ చేసే వైద్య వృత్తిలో ఉన్న డాక్టరే తన దగ్గర పనిచేసే సిబ్బందిని వేధింపులకు గురి చేశాడు. స్టాఫ్ నర్స్ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లా ఉదయగిరి ప్రభుత్వాసుపత్రిలో చోటు చేసుకుంది. బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం… ఆస్పత్రిలో పనిచేస్తున్న డాక్టర్ రవీంద్ర నాథ్ ఠాగూర్ అనే వ్యక్తి డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్లిన స్టాఫ్ నర్సుకు కాల్ చేశాడు. తనకు ఆమ్లేట్ కావాలన్నాడు. దీంతో నర్సు సరేనంటూ… ఆస్పత్రి సిబ్బందిని పంపిస్తే… ఆమ్లేట్ వేసి పంపుతానంటూ తెలిపింది. దీనికి ఆయన లేదు నువ్వే తీసుకురావాలన్నారు. సరే తమ ఆస్పత్రి…

Read More

నిర్భయ దోషులకు సుప్రీంకోర్టు నోటీసులు… ఉరి వేసేది ఎప్పుడు?

ఢిల్లీ నిర్భయ కేసులో దోషులకు ఉరి వేయాలనుకున్న కేంద్రం నిర్ణయాన్ని ఢిల్లీ హైకోర్టు పక్కన పెట్టడంతో… ఢిల్లీ హైకోర్టు నిర్ణయాన్ని పక్కన పెట్టాలంటూ… కేంద్రం పెట్టుకున్న పిటిషన్‌పై సుప్రీంకోర్టు స్పందించింది. దీనిపై ఈ కేసులో దోషులైన నలుగురికీ సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. నిజానికి ఈ కేసులో దోషులకు ఉరి అంశాన్ని నిరవధికంగా వాయిదా వేసింది ట్రయల్ కోర్టు. దాంతో ట్రయల్ కోర్టు నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ… కేంద్రం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఢిల్లీ హైకోర్టు… కింది కోర్టు నిర్ణయాన్ని స్వాగతించింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే… ఉరి ఎప్పుడు వెయ్యాలో నెక్ట్స్ డేట్ ఫిక్స్ చెయ్యమని ట్రయల్ కోర్టును కేంద్ర అధికారులు కోరవచ్చని తెలిపింది. సో, ఇప్పుడు ట్రయల్ కోర్టు నిర్ణయం కీలకం కాబోతోంది. వాయిదా ఎందుకు వేసిందంటే : నిర్భయ దోషులు… ఒకరి తర్వాత ఒకరుగా క్షమాభిక్ష…

Read More

హైదరాబాద్‌లో దారుణం… ఆర్థిక ఇబ్బందులతో దంపతుల ఆత్మహత్య

హైదరాబాద్‌లో విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక భార్యభర్తలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ దుర్ఘటన వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా మాల్‌ కేశంపల్లి గ్రామానికి చెందిన వెంకట్‌రెడ్డి ,నిఖిత భార్యాభర్తలు. వీరికి యత్వంత్ రెడ్డి అనే రెండేళ్ల బాబు కూడా ఉన్నాడు. కొంత కాలంగా బీఎన్‌రెడ్డినగర్‌లో అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. వెంకట్‌రెడ్డి వృత్తిరీత్యా ప్రైవేటు ఉద్యోగి. వచ్చిన జీతం చాలాక…. కొన్ని రోజులుగా ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు వీరి కుటుంబం బాధపడుతుంది. దీంతో భార్యభర్తలిద్దరూ కుంగిపోయారు. ఎవరి దగ్గర చేయిచాచి అడుగుతాంలే అనుకున్నారు. తమలో తమే మదనపడ్డారు. తమ కష్టాన్ని కన్నవాళ్లకు సైతం చెప్పుకోలేదు. ఇద్దరు కుంగిపోయారు. బతకలేక చావాలనుకొని నిశ్చయించుకున్నారు. దీంతో కలిసి నిండు నూరేళ్లు బతకాల్ని ఇద్దరూ కలిసి ఆత్మహత్య చేసుకున్నారు. మంగళవారం…

Read More

ఇండియా పర్యటనపై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

భారత పర్యటన కోసం తాను ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. తన పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య కీలకమైన ఒప్పందాలు జరగబోతున్నాయనే సంకేతాన్ని ఆయన ఇచ్చారు. ఫిబ్రవరి 24, 25 తేదీల్లో ట్రంప్ భారత్ లో పర్యటించబోతున్న సంగతి తెలిసిందే. ఢిల్లీలో మాత్రమే పర్యటన కొనసాగాలని తొలుత భావించినప్పటికీ… గుజరాత్ లోని అహ్మదాబాద్ లో కూడా పర్యటించాలని ట్రంప్ నిర్ణయించారు. ఈ సందర్భంగా వైట్ హౌస్ లో మీడియా ప్రతినిధులతో ట్రంప్ మాట్లాడుతూ, ప్రధాని మోదీ గొప్ప జంటిల్మన్ అని కితాబిచ్చారు. అమెరికాతో కలసి ఎంతో చేయాలని భారత్ భావిస్తోందని… అవసరమైన అన్ని ఒప్పందాలు చేసుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని… భారత్ లో కలిసి ముందుకు సాగుతామని చెప్పారు. గత ఏడాది అమెరికాలో మోదీ పర్యటించినప్పుడు హ్యూస్టన్ స్టేడియంలో భారీ సభను…

Read More