రాజ్యసభలో విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు

:రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎల్‌ఐసీలో పెట్టుబడుల ఉపసంహరణ చారిత్రక తప్పిదమన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన శ్రేయస్కరం కాదని, పరోక్ష పద్ధతుల్లో నిధులు సేకరించే మార్గాలపై ప్రభుత్వం దృష్టి పెట్టడం సరికాదని చెప్పారు. పన్నుల వసూళ్ల ద్వారా రూ.1.50లక్షల కోట్ల ఆదాయం సమకూర్చుకోవాలన్న… గత బడ్జెట్‌ లక్ష్య సాధనలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందని విజయసాయి విమర్శించారు. Tags : vijayasai reddy , mp ysrcp , lic rajyasabha , delhi ,

Read More

జాను కలెక్షన్స్.. పని చేయని సమంత, శర్వానంద్ మాయ..

సమంత, శర్వానంద్ జంటగా ప్రేమ్ కుమార్ తెరకెక్కించిన సినిమా జాను. తమిళనాట చరిత్ర సృష్టించిన 96 సినిమాకు రీమేక్ ఇది. అక్కడ క్లాసిక్ అనడంతో ఇక్కడ కూడా సూపర్ హిట్ అవుతుందని అంతా అంచనా వేసారు కానీ ఇప్పుడు కలెక్షన్లు చూస్తుంటే మాత్రం అలా జరగడం లేదు. ఈ చిత్రం ఓపెనింగ్స్ కూడా నిరాశజనకంగానే ఉన్నాయి. ముఖ్యంగా మూడు రోజుల తర్వాత జాను పరిస్థితి డైలమాలో పడిపోయింది. దిల్ రాజు నమ్మిన మ్యాజిక్ ఇక్కడ రిపీట్ కావడం లేదు. ఇప్పటి వరకు కేవలం 7 కోట్లు మాత్రమే వసూలు చేసింది జాను. తొలిరోజు నుంచే మల్టీప్లెక్స్ ఆడియన్స్ మాత్రమే ఈ చిత్రానికి కనెక్ట్ అయ్యారు. బి,సి సెంటర్స్‌లో వసూళ్ల వేటలో బాగానే వెనకబడిపోయింది. వీకెండ్ కలెక్షన్స్ చూస్తుంటే జాను పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ…

Read More

కేజ్రీవాల్‌కు గెలుపుపై సీఎం జగన్ స్పెషల్ ట్వీట్

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌. ఆప్ పార్టీని పోటీకి దిగిన ఆయన అత్యధిక స్థానాల్లో గెలుపు సాధించి మరోసారి ఢిల్లీ పీఠాన్ని చేజెక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు కేజ్రీవాల్‌కు ఆయన విషెస్ చెబుతూ ట్వీట్ చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రక విజయం సాధించిన కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీకి జగన్ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. మీ ఐదేళ్ల పదవీకాలం విజయవంతంగా కొనసాగాలని ఆశిస్తున్నానంటూ జగన్ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఢిల్లీలో మరోసారి చీపురు ఉడ్చేసింది. కేంద్రంలో అధికారంలో ఉన్న కమలం పార్టీని సైతం పరుగులు పెట్టించి దేశ రాజధానిలో తన సత్తా…

Read More

కేజ్రీవాల్ ఘన విజయంపై మూడు ముక్కల్లో స్పందించిన నితీశ్

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం దిశగా దూసుకుపోతోంది. మొత్తం 70 సీట్లు ఉన్న అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం 60 సీట్లను ఆప్ కైవసం చేసుకోబోతోంది. మిగిలిన 10 స్థానాల్లో బీజేపీ గెలవబోతోంది. ఈ నేపథ్యంలో, కేజ్రీవాల్ కు దేశ వ్యాప్తంగా ఉన్న రాజకీయ ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సదర్భంగా బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ స్పదించారు. ‘జనతా మాలిక్ హై (ఓటర్లే రాజులు)’ అంటూ ఆయన మూడు ముక్కల్లో తన స్పందనను తెలియజేశారు. బీజేపీతో ఉన్న పొత్తు నేపథ్యంలో, ఢిల్లీలో రెండు స్థానాల్లో నితీశ్ కు చెందిన జేడీయూ పోటీ చేసింది. మూడు స్థానాల్లో నితీశ్ కుమార్ ప్రచారం నిర్వహించారు. అమిత్ షాతో కలసి చేసిన ప్రచారంలో నితీశ్ కుమార్ ఢిల్లీ…

Read More

జాతీయస్థాయిలో తెలంగాణ మరో రికార్డ్

తెలంగాణ రాష్ట్రం మరో విషయంలో నెంబర్‌వన్‌గా నిలిచింది. మొక్కల పెంపకంలోనూ తెలంగాణ నెంబర్‌వన్ గా నిలిచిందని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మొక్కల పెంప‌కంలో తెలంగాణ తొలి స్థానంలో నిలిచింద‌ని కేంద్ర అట‌వీ శాఖ గణాంకాలు వెల్లడించడంపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ నేప‌థ్యంలో ఆయన అట‌వీ శాఖ అధికారులు, సిబ్బందికి అభినంద‌న‌లు తెలిపారు. మొక్కల పంప‌కం, అట‌వీ పున‌రుజ్జీవ‌నం, అట‌వీ రక్షణకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్లే ఇది సాధ్యమైందన్నారు. ప్రభుత్వం చేప‌డుతున్న అట‌వీ ర‌క్షణ చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని తెలిపారు. ఆకుప‌చ్చ తెలంగాణ సాధ‌న ల‌క్ష్యానికి చేరువ‌లో ఉన్నామ‌ని, అధికారులు, సిబ్బంది మ‌రింత కష్టపడి ఆ దిశగా ప‌ని చేయాల‌ని అన్నారు. రానున్న రోజుల్లో అట‌వీ పున‌రుజ్జీవ‌నంపై మ‌రింత దృష్టి…

Read More