ఉల్లిధర క్వింటాల్‌కు రూ. 2,000 చేరిక!

దేశాన్ని కుదిపేసిన ఉల్లిధరలు పూర్తిగా దిగివస్తున్నాయి. తెలంగాణతో పాటు ఇతర రాష్ర్టాల నుంచి భారీఎత్తున దిగుమతులు పెరిగిపోవడంతో ధరలు బాగా తగ్గాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లోని హోల్‌సేల్‌ మార్కెట్‌లలో క్వింటాల్‌కు 2000 నుంచి 2500 రూపాయలకు చేరింది. రిటైల్‌ మార్కెట్‌లోనూ కిలో ఉల్లిగడ్డ 25 నుంచి 30 రూపాయలకు దిగి వచ్చింది. ఒక దశలో ఏకంగా కిలో 200 రూపాయలు పలికిను ఉల్లిగడ్డ ప్రస్తుతం భారీగా తగ్గింది. హైదరాబాద్‌ నగరంలోని ప్రధాన హోల్‌సేల్‌ మార్కెట్‌లయిన మలక్‌పేట,బోయిన్‌పల్లి, గుడిమల్కాపూర్‌తో పాటు బేగంబజార్‌కు భారీ ఎత్తున ఉల్లిదిగుమతి అవుతోంది. ప్రధానంగా మహారాష్ట్ర నుంచి అత్యధికంగా ఉల్లి నగరానికి దిగుమతి అవుుతోంది. దాంతో పాటు కర్నాటక నుంచి కొంత మేరకు ఉల్లి అవసరాలు తీరుస్తున్నాయి. దీంతో పాటు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ర్టాల్లోనూ ఉల్లి దిబడి బాగా పెరిగింది. నగరానికి భారీఎత్తున దిగుమతి…

Read More

కర్నూలులో ఓటర్ లిస్టులో వెంకటేష్…

ఎలక్షన్ కమిషన్‌ రిలీజ్ చేసి ఓటర్ జాబితాల్లో కొన్ని కొన్ని సార్లు భయంకరమైన తప్పులు దొర్లుతూ ఉంటాయి. అలాంటిదే ఇది కూడా. కర్నూలు నగర పాలక సంస్థ విడుదల చేసిన ఓటర్ జాబితాలో హీరో వెంకటేష్ ఫొటో ఉంది. కర్నూలులోని 31వ వార్డులో ఓటరు పేరు రాణి కూమరొలూ అని ఉంది. తండ్రి / భర్త పేరు బాలు కూమరొలూ. ఇంటి నెంబర్ 83/54a. వయసు 20 సంవత్సరాలు. లింగము : స్త్రీ అని రాసి ఉంది. అయితే, పక్కన ఫొటో మాత్రం వెంకటేష్ ఫొటో ఉంది. ఓటర్ కార్డు నెంబర్ ZGF3524139. హీరో వెంకటేష్ హైదరాబాద్‌లో నివాసం ఉంటాడు. తెలంగాణలో ఓటర్. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. ఓటర్ లిస్టులో ఫొటోలు అప్‌లోడ్ చేసే సమయంలో జరిగిన పొరపాటు…

Read More

ఒకే వేదికపై హిందూ, ముస్లిం వివాహాలు

ఒకే వేదికపై హిందూ, ముస్లిం జంటలు ఏకమై మతసామరస్యాన్ని చాటిన సందర్భం గుజరాత్ లో చోటుచేసుకుంది. ఈషా పౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. గత ఎనిమిదేళ్లుగా తాము ఈ తరహా వివాహాలను జరుపుతున్నట్లు ట్రస్ట్ వెల్లడించింది. వివరాలను పరిశీలిస్తే.. తాజాగా గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఒకే వేదికపై హిందూ, ముస్లిం మతాలకు చెందిన 1100మంది వధూవరులు వివాహ బంధంతో ఒక్కటయ్యారని ఈషా ఫౌండేషన్ ట్రస్ట్ ప్రకటించింది. వివాహ తంతు ముగిసిన తర్వాత ఈషా ఫౌండేషన్ ట్రస్ట్ నిర్వాహకులు హిందువులకు అతి పవిత్రమైన గ్రంథం భగద్గీత, ముస్లింలకు అతి పవిత్రమైన గ్రంథం ఖురాన్ గ్రంథాలను కొత్త దంపతులకు బహుమతిగా అందించారు. Tags : Hindu , Muslim , At On Dias Marriages , Gujrat , Eesha Foundation

Read More

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరో షాక్… ఫైబర్ నెట్ ధరల పెంపు

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరో షాక్ తగిలింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్-APSFL టారిఫ్‌ను పెంచింది. ఒకేసారి రూ.50 టారిఫ్‌ను పెంచింది ఏపీఎస్ఎఫ్ఎల్. ప్రస్తుతం కనీస టారిఫ్ రూ.149 కాగా, దానికి ఎల్ఓటీ బాక్స్, జీఎస్‌టీ కలిపి రూ.235 వసూలు చేస్తోంది. ఇప్పుడు ఇది మరింత భారంగా కానుంది. మరో రూ.50 అదనంగా వసూలు చేయాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ నిర్ణయించింది. వీటికి ట్యాక్స్ కూడా కలిపితే కనీస ఛార్జీలు నెలకు రూ.300 చెల్లించాల్సి వస్తుంది. కొత్త టారిఫ్ ఇదే నెలలో అమలులోకి రానుంది. ఫైబర్ నెట్ టారిఫ్ పెంపు భారం 10 లక్షల మంది యూజర్లపై పడనుందని అంచనా. ఇప్పటివరకు ఏపీ ఫైబర్ నెట్ ఛార్జీలు తక్కువగా ఉన్నాయని భావిస్తున్నారు యూజర్లు. ఇప్పుడు టారిఫ్ పెంచడంతో ప్రైవేట్ ఆపరేటర్లతో సమానంగా టారిఫ్ ఉండబోతోంది.…

Read More

మైహోం రామేశ్వర్‌ రావుకు షాక్… భూ కేటాయింపులపై హైకోర్టులో పిటిషన్

మై హోం రామేశ్వర్ రావుకు కాంగ్రెస్ పార్టీ షాక్ ఇచ్చింది. ఆ సంస్థకు చేసిన భూ కేటాయింపులపై హైకోర్టు లో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. రాయదుర్గంలో వందలకోట్లు విలువచేసే భూమిని మైహోమ్ కు కేటాయించరని పిల్‌లో ఆయన పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా రూ. 38 కోట్ల స్టాంప్ డ్యూటీ మినహాయింపు ఇచ్చారన్నారు ఎంపీ రేవంత్. ఈ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. రామేశ్వర్ రావు తో పాటు, ప్రభుత్వానికి, DLF సంస్థకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 4 వారాలపాటు కేసును వాయిదా వేసింది న్యాయస్థానం.   Tags : revanth reddy , Telangana , High Court , TV9

Read More