కేటీఆర్, హరీశ్‌లకు ఐటీశాఖ నోటీసులు! ‘కూలి పనే’ కొంపముంచిందా?

టీఆర్‌ఎస్‌కు చెందిన కొందరు ముఖ్య నేతలకు ఆదాయ పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. మూడేళ్ల క్రితం వారు చేపట్టిన గులాబీ కూలీ కార్యక్రమానికి సంబంధించి వివరాలు, లెక్కలు చెప్పాలంటూ ఐటీశాఖ ఇప్పుడు తాఖీదులిచ్చినట్లు తెలుస్తోంది. ఐటీశాఖ కన్ను పడిన వారిలో కొందరు మంత్రులు, మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నట్లు సమాచారం. కేటీఆర్‌, హరీశ్‌ రావు, మహమూద్‌ అలీ, ఈటల రాజేందర్ సహా ఈ జాబితాలో చాలా మంది పేర్లు ఉన్నట్లుగా విశ్వసనీయంగా తెలిసింది. మూడేళ్ల క్రితం వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని టీఆర్ఎస్ పార్టీ వరంగల్‌లో పెద్ద ఎత్తున ప్రగతి నివేదన సభ నిర్వహించింది. అయితే అప్పుడు ఈ సభకు వచ్చే కార్యకర్తల దారి ఖర్చుల కోసం వినూత్నంగా ‘గులాబీ కూలీ’ పేరిట టీఆర్‌ఎస్‌ ఓ కార్యక్రమం చేపట్టింది. అగ్ర నేతల పిలుపు మేరకు అప్పటి మంత్రులు,…

Read More

హైదరాబాద్‌లో 9 మంది అనుమానితులు?

హైదరాబాద్‌ నగరంలో తొమ్మిది మంది కరోనా వైరస్‌ అనుమానంతో ఆస్పత్రులను ఆశ్రయించారు. ఇటీవల ఇండిగో విమానంలో ప్రయాణించిన ఇద్దరికి వైరస్‌ సోకినట్లు గుర్తించడంతో మిగిలిన ప్రయాణికుల్లో ఎవరికైనా అనుమానం ఉంటే నిర్ధారణ పరీక్షలు చేయాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. అందులో భాగంగా బుధవారం ముగ్గురు ఎయిర్‌హోస్టె్‌సలను గాంధీ ఆస్ప్రతికి తరలించి, పరీక్షలు చేస్తున్నారు. వారితో పాటు మరో ఇద్దరు వ్యక్తులు అనుమానంతో పరీక్షలు చేయించుకునేందుకు వచ్చారు. ఫీవర్‌ ఆస్పత్రిలో మరో నలుగురు అనుమానితులు చేరారు. బీజింగ్‌ నుంచి సొంత పని మీద హైదరాబాద్‌ వచ్చిన ఇద్దరు చైనా దేశస్థులు అనుమానంతో ఫీవర్‌ ఆస్పత్రిలో చేరి వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. తర్వాత వైద్యుల పర్యవేక్షణలో ఉండకుండానే వెళ్లిపోయారు. నగరానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఇటీవల చైనా వెళ్లి వచ్చారు. వారు కూడా అనుమానంతో ఫీవర్‌ ఆస్పత్రికి వచ్చారు.

Read More

ఐటీ ఆక‌స్మిక దాడులు.. షాక్‌లో స్టార్ హీరో

ఆదాయ‌పు ప‌న్ను ( ఐటీ) శాఖ అధికారులు ‘బిగిల్’ సినిమాను నిర్మించిన ఏజీఎస్ గ్రూప్ కార్యాలయంతో పాటు మాస్ట‌ర్ సినిమా షూటింగ్‌లో ఉన్న విజ‌య్‌ని విచారించ‌డం త‌మిళ‌నాట హాట్ టాపిక్‌గా మారింది. కుడ్డలూర్ జిల్లాలోని నెయ్వేలిలో మాస్ట‌ర్‌ షూటింగ్ జరుగుతుండ‌గా, ఐటీ అధికారులు నేరుగా నెయ్వేలి వెళ్లి షూటింగ్ జరుగుతున్న చోటే విజయ్‌ను విచారించారు. ఐదు గంట‌ల పాటు అత‌నిని విచారించిన త‌ర్వాత నెయ్వేలి నుండి రోడ్డు మార్గం ద్వారా చెన్నైకి తీసుకెళ్లిన‌ట్టు స‌మాచారం. భారీ మొత్తంలో ఆదాయపు పన్ను ఎగ్గొట్టారనే అనుమానంతో ఏజీఎస్ గ్రూపునకు సంబంధించి 20 చోట్ల సోదాలు నిర్వ‌హించ‌డంతో పాటు నిర్మాణ సంస్థ నుంచి విజయ్‌కు ఎంత ముట్టింద‌నే దానిపై ఆరాలు తీసిన‌ట్టు తెలుస్తుంది. విజ‌య్‌ని అర్ధాంత‌రంగా లొకేష‌న్ నుండి తీసుకెళ్ళ‌డంతో మాస్ట‌ర్ షూటింగ్‌కి బ్రేక్ ప‌డింది. మ‌ళ్ళీ ఎప్పుడు మొద‌ల‌వుతుంద‌నే దానిపై…

Read More

నేడు గద్దెలపైకి చేరుకోనున్న సమ్మక్క తల్లి

మేడారం మహా జాతర రెండో రోజూ అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. బుధవారం రాత్రి కన్నెపల్లి నుంచి సారలమ్మ మేడారం గద్దెకు చేరుకోవడంతో జాతర తొలిఘట్టం పూర్తయింది. మరోవైపు పూనుగొండ్ల నుంచి పగిడిద్ద రాజు, కొండాయి నుంచి గోవిందరాజు తరలివచ్చి మేడారం గుడి వద్ద సారలమ్మకు స్వాగతం పలికారు. ముగ్గురు దేవతల రాకతో జాతర ప్రాంతం సంబురంతో తొణికిసలాడింది. సమ్మక్క తల్లి నేడు గద్దెలపైకి చేరుకోనుంది. చిలుకలగుట్టపై నుంచి సమ్మక్కను పూజారులు తీసుకురానున్నారు. సమ్మక్క ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య సమ్మక్క తల్లిని గద్దెలపై ప్రతిష్టించనున్నారు. కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్కకు సంప్రదాయ పూజలు నిర్వహించనున్నారు. ఇక సమ్మక్క గద్దెలపైకి వచ్చే సమయంలో స్థానిక ఎస్పీ గాల్లోకి కాల్పులు జరపనున్నారు. సమ్మక్క తల్లి రాకతో జాతర పతాక స్థాయికి చేరుకోనుంది. శుక్రవారం భక్తుల దర్శనాల తర్వాత శనివారం…

Read More

8న మినీ జాబ్‌ మేళా..

యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడానికి ఈ నెల 8న మినీ జాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్లు ఉస్మానియా యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్‌ ఇన్ఫర్మేషన్‌ గైడెన్స్‌ బ్యూరో మోడల్‌ కెరియర్‌ సెంటర్‌ డిప్యూటీ చీఫ్‌ అధికారి ఎన్‌. అనంతరెడ్డి బుధవారం తెలిపారు. 12 కంపెనీల్లో దాదాపు 900 ఉద్యోగాల ఎంపికకు ఈ మినీ జాబ్‌మేళా నిర్వహిస్తున్నామన్నారు. 19 నుంచి 30 ఏండ్ల మధ్య వయసు గల యువత సింఖ్రో సర్వ్‌ గ్లోబల్‌ సొల్యూషన్‌ అల్వాల్‌ నందు ఉదయం 10.30 గంటలకు జాబ్‌మేళాకు హాజరు కావాలన్నారు. వివరాలకు యంగ్‌ ప్రొఫెషనల్‌ టి. రఘుపతి నంబరు 8247656356/9100064574కు ఫోన్‌ చేయాలని సూచించారు.

Read More