ఆ ఒక్క రోజే వాట్సాప్‌లో 10,000 కోట్ల మెసేజ్‌లు!

ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. వాట్సాప్‌ ఫ్లాట్‌ఫాంగా నూతన సంవత్సర శుభాకాంక్షలతో మెసేజ్‌లు పోటెత్తాయి. న్యూ ఇయర్‌ విషెస్‌ చెప్పేందుకు వాట్సాప్‌ను ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఎంచుకోవడంతో ఆ ఒక్కరోజే ఏకంగా 10,000 కోట్ల మెసేజ్‌లు వెల్లువెత్తాయి. ఒక్కరోజులో ఇంత భారీ సంఖ్యలో మెసేజ్‌లు ఎక్స్ఛేంజ్‌ కావడం ఇదే అత్యధిక రికార్డుగా నమోదైంది. వీటిలో 2000 కోట్లకు పైగా మెసేజ్‌లు భారతీయులు పంపినవే కావడం విశేషం. పదివేల కోట్లకు పైగా వాట్సాప్‌లో షేరయిన మెసేజ్‌ల్లో 1200 కోట్లు ఇమేజ్‌లున్నాయి. నూతన సంవత్సరంలోకి ప్రవేశించే డిసెంబర్‌ 31 అర్ధరాత్రి వరకూ 24 గంటల సమయంలో ప్రపంచవ్యాప్తంగా 10,000 కోట్ల (100 బిలియన్‌) మెసేజ్‌లు షేర్‌ అయ్యాయని వాట్సాప్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. పదేళ్ల కిందట వాట్సాప్‌ సేవలు మొదలైనప్పటి నుంచి ఒకే రోజు…

Read More

మరో హామీని సగర్వంగా నిలబెట్టుకున్నా: వైఎస్ జగన్

ఎన్నికలకు ముందు తాను ఇచ్చిన హామీల్లో మరో హామీని ఇప్పుడు నిలబెట్టుకున్నానని చెప్పేందుకు గర్వపడుతున్నానని ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం ఏలూరులో వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ పైలెట్ ప్రాజెక్టును ఆయన ప్రారంభించారు. ఇంతవరకూ ఆరోగ్య శ్రీ పథకం కింద దాదాపు 1059 వ్యాధులకు మాత్రమే వైద్యం అందేదని, ఇకపై 2,059 వ్యాధులకు వైద్యం అందుతుందని జగన్ ప్రకటించారు. వైద్యం ఖర్చు రూ. 1000 దాటితే ఆరోగ్య శ్రీ వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు. రోగం నయమైన తరువాత విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచిస్తే, బాధితుడికి నెలకు రూ. 5 వేలు చొప్పున ఇస్తామని జగన్ వ్యాఖ్యానించారు. గత ఏడు నెలలుగా ఆరోగ్య శ్రీ సేవల్లో విప్లవాత్మక మార్పులను తెచ్చేందుకు ఎంతో కృషి చేశామని చెప్పిన జగన్, పశ్చిమ గోదావరి జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు…

Read More

నిరూపించండి.. రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా: ఎమ్మెల్యే ఆర్కే

అమరావతి భూములు మీరు కొన్నారంటే, మీరు కొన్నారంటూ వైసీపీ, టీడీపీ నేతల మధ్య తీవ్ర ఆరోపణలు, ప్రత్యారోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. టీడీపీ నేతలు ఇన్సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారంటూ వైసీపీ నేతలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇందులో ఎవరెవవరు ఎన్ని ఎకరాల భూములు కొన్నారో వెల్లడించారు. దీనికి కౌంటర్ గా టీడీపీ నేతలు కూడా ఒక జాబితాను బయటపెట్టారు. అమరావతి ప్రాంతంలో భూములను కొన్న వైసీపీ నేతలు వీరే అంటూ పేర్లను వెల్లడించారు. ఈ జాబితాలో మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) పేరు కూడా ఉంది. ఈ నేపథ్యంలో, ఈరోజు తాడేపల్లిలో ప్రెస్ మీట్ నిర్వహించిన ఆర్కే… వివరణ ఇచ్చారు. రాజధాని పేరిట అక్రమాలకు పాల్పడింది టీడీపీ అధినేత చంద్రబాబేనని ఆర్కే ఆరోపించారు. తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికే ఆయన ఇలాంటి పనులు…

Read More

చిరంజీవి ముందే ఇంత గోలా?… బాధేసిందన్న శివాజీ రాజా!

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ‘మా’ డైరీ ఆవిష్కరణ సందర్భంగా నిన్న హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో జరిగిన రసాభాసపై నటుడు, ‘మా’ మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా స్పందించారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన, మెగాస్టార్ చిరంజీవి ముందే ఈ విధమైన గోల జరగడం, తనకు చాలా బాధగా అనిపించిందని అన్నారు. ఇంత జరుగుతుంటే, అధ్యక్షుడు ఏం చేస్తున్నాడని ప్రశ్నించిన శివాజీ రాజా, రాజశేఖర్ మైక్ ను తీసుకోకముందే స్పందించివుంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. వేదికపైకి రాకముందే అంతర్గత సమస్యలను పరిష్కరించుకునే దిశగా చొరవ చూపించి వుంటే ఈ పరిస్థితి ఉత్పన్నం అయ్యుండేది కాదని సీనియర్ నరేశ్ టార్గెట్ గా శివాజీ రాజా వ్యాఖ్యానించారు. ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే, శిక్షించేందుకు అసోసియేషన్ లో క్రమశిక్షణా కమిటీ ఉందని వ్యాఖ్యానించిన ఆయన, ఆ కమిటీ తన…

Read More