వయసు ఎనిమిదేళ్లు… వార్షిక సంపాదన రూ.185 కోట్లు

పట్టుమని పదేళ్లులేవు. కానీ ఏటా కోట్లు కూడబెడుతున్నాడీ బుడతడు. అతని వార్షిక ఆదాయం చూసి ఫోర్బ్స మ్యాగజైన్ తన పత్రికలో చోటు కల్పించిందంటే ఇతని ప్రత్యేక అర్థం చేసుకోవచ్చు. టెక్సాస్ కు చెందిన ఎనిమిదేళ్ల కుర్రాడు తన కళ్లు చెదిరే ఆదాయంతో అందరినీ ఆకర్షిస్తున్నాడు. వివరాల్లోకి వెళితే…టెక్సాస్ కు చెందిన ర్యాన్ కాజీ వయసు ఎనిమిదేళ్లు. ఇతని మూడేళ్ల వయసులో అతని తల్లిదండ్రులు కాజీ పేరున ‘ర్యాన్ వరల్డ్’ పేరుతో ఓ యూట్యూబ్ చానల్ ప్రారంభించాడు. మొదట్లో ఈ చానల్ కు అంతగా ఆదరణ లేకపోయినా తదనంతర కాలంలో కాజీ పోస్టు చేసిన వీడియోల వల్ల పుంజుకుంది. తాజాగా ‘ర్యాన్ టోయ్స్ రివ్యూ’గా ఈ చానల్ పేరు మార్చారు. ఈ చానల్ కొత్తగా మార్కెట్లోకి వచ్చిన బొమ్మలు, ఆటవస్తువుల గురించి ర్యాన్ ఆడుకుంటూ వివరిస్తూ వీడియోలు పోస్టు…

Read More

రాష్ర్టానికి ప్రత్యేక నిధులివ్వండి

కేంద్రప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తితో వ్యవహరించి రాష్ర్టాలకు తగిన ఆర్థిక సహకారాన్ని అందించాలని రాష్ట్ర ఆర్థికమంత్రి తన్నీరు హరీశ్‌రావు కోరారు. తెలంగాణ వంటి బలంగా ఎదుగుతున్న రాష్ర్టాలను ప్రోత్సహించి బలమైన రాష్ర్టాలు.. బలమైన దేశం అన్న సూత్రాన్ని పాటించాలని సూచించారు. నీతిఆయోగ్ సిఫారసులను అనుసరించి మిషన్ భగీరథ, మిషన్‌కాకతీయకు ప్రత్యేక నిధులు ఇవ్వాలని, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని డిమాండ్‌చేశారు. విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని విజ్ఞప్తిచేశారు. ఈ మేరకు రాబోయే 2020-21 వార్షిక బడ్జెట్‌లో తెలంగాణకు ప్రత్యేక నిధులను కేటాయించాలని డిమాండ్‌చేశారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ అధ్యక్షతన ఢిల్లీలో బుధవారం నిర్వహించిన కేంద్ర బడ్జెట్ ముందస్తు సమావేశంలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ రాష్ర్టానికి రావాల్సిన అంశాలను ప్రస్తావిస్తూనే దేశ ఆర్థిక పురోగతికి, రాష్ర్టాల బలోపేతానికి కేంద్రం తీసుకోవాల్సిన చర్యలపై నిర్దిష్ట సూచనలుచేశారు.

Read More

రాజు మారినప్పుడల్లా రాజధాని మారదు.. కేంద్రం చూస్తూ ఊరుకోదు: సుజనా చౌదరి

అమరావతి నుంచి రాజధానిని మార్చడం అంత సులువు కాదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి అన్నారు. రాజు మారినప్పుడల్లా రాజధాని మారదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారం చేస్తానంటే ప్రభుత్వం ఒప్పుకోదని అన్నారు. రాజధాని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. హైకోర్టు ఒక చోట, రాజధాని మరోచోట ఉంటే పెద్ద ఇబ్బందులేమీ ఉండవని అన్నారు. ఒక చోట హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసుకుంటే సరిపోతుందని చెప్పారు. కానీ, అసెంబ్లీ, సెక్రటేరియట్ లు వేర్వేరు ప్రాంతాల్లో ఉంటే చాలా ఇబ్బందులు ఎదురవుతాయని అన్నారు. రాజధాని నిర్మాణంలో గత ముఖ్యమంత్రి చంద్రబాబు జాప్యం చేశారని సుజనా చౌదరి చెప్పారు. దాన్ని అవకాశంగా తీసుకుని ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ ప్రజల్లో గందరగోళాన్ని సృష్టిస్తున్నారని విమర్శించారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరిగితే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని… కానీ, పరిపాలన…

Read More