నేను క్షమాపణలు చెప్పను.. కాసేపట్లో ఓ వీడియోను ట్వీట్ చేస్తాను: రాహుల్ గాంధీ

‘రేప్ ఇన్ ఇండియా’ అంటూ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని లోక్ సభలో బీజేపీ ఎంపీలు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై రాహుల్ గాంధీ స్పందించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ… ‘నేను క్షమాపణలు చెప్పను. ఢిల్లీని అత్యాచారాలకు రాజధానిగా పేర్కొంటూ మోదీ గతంలో వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించిన క్లిప్ నా ఫోనులో ఉంది. ఈ క్లిప్ ను నేను ట్వీట్ చేస్తాను.. ప్రతి ఒక్కరు చూడొచ్చు. పౌరసత్వ సవరణ బిల్లుపై ఈశాన్య భారత్ లో చెలరేగుతోన్న ఆందోళనల నుంచి అందరి దృష్టిని పక్కదారి పట్టించడానికే బీజేపీ ప్రయత్నిస్తోంది’ అని చెప్పారు.

Read More

తిరుమలలో కొత్తరకం మోసం..

శ్రీవారి సిపారస్సులపై కేటాయించే దర్శనంలో కొత్త రకం మోసాన్ని జెఈవో కార్యాలయ సిబ్బంది గుర్తించింది. ఐఆర్‌ఎస్ అధికారిన౦టూ గుంటూరుకు చెందిన వెంకటరత్నారెడ్డి అనే వ్యక్తి శ్రీవారి దర్శనానికి సిఫార్సు లేఖలను జెఈవో కార్యాలయానికి పంపించాడు. ముంబాయిలో ఇంటెలిజెన్స్ అసిస్టెంట్ కమిషనర్‌నంటూ సిఫార్సు లేఖను పంపాడు. అయితే నకిలీ ఐఆర్‌ఎస్ అధికారిగా గుర్తించిన జెఈవో కార్యాలయ సిబ్బంది… పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రత్నారెడ్డిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. గతంలోనూ ఇదే తరహాలో రత్నారెడ్డి. శ్రీవారిని దర్శించుకున్నాడు. నఖిలీ అధికారి బాగోతం బయటపడడంతో ఉన్నతాధికారులు సిఫార్సు లేఖలు కూడా క్షుణ్ణంగా పరిశిలిస్తున్నారు.

Read More

ఉప్పల్‌లో భారీ కన్వెన్షన్‌ సెంటర్‌!

హైదరాబాద్‌ సమగ్రాభివృద్ధిలో భాగంగా నగరానికి తూర్పువైపున మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తున్న రాష్ట్రప్రభుత్వం మరో భారీప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నది. కమర్షియల్‌, డొమెస్టిక్‌ భవనాల నిర్మాణానికి వీలుగా భగాయత్‌ లే అవుట్‌ అభివృద్ధి, మినీ శిల్పారామం ఏర్పాటు, మెట్రోకు తగ్గట్టుగా మౌలిక వసతుల కల్పనతో దినదినాభివృద్ధి చెందుతున్న ఉప్పల్‌ ప్రాంతంలో భారీ కన్వెన్షన్‌ సెంటర్‌ను ఏర్పాటుచేయాలని యోచిస్తున్నది. హైటెక్స్‌ తరహాలో సదస్సులు, ప్రోత్సాహకాలు, సాంస్కృతిక ప్రదర్శనల నిర్వహణ కోసం ఎంఐసీఈ (మీటింగ్స్‌, ఇన్‌సెంటివ్స్‌, కల్చర్‌ ఎగ్జిబిషన్‌) అనే ప్రపంచస్థాయి కేంద్రం ఏర్పాటుపై దృష్టి సారించింది. ఈ భారీప్రాజెక్టుపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలనే మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు హెచ్‌ఎండీఏ అధికారులు చర్యలు ప్రారంభించారు. పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్ట్‌నర్‌షిప్‌ (పీపీపీ) పద్ధతిలో ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే దీనిని కార్యరూపంలోకి తీసుకువచ్చే దిశగా…

Read More

విక్టరీ వెంక‌టేష్‌కి శుభాకాంక్ష‌ల వెల్లువ‌

ఒకే చ‌ట్రంలో ఇరుక్కుపోకుండా కెరీర్‌లో వైవిధ్య‌మైన చిత్రాల‌ని చేస్తూ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న హీరో విక్ట‌రీ వెంక‌టేష్‌. సీరియ‌స్‌, యాక్ష‌న్, కామెడీ, రొమాన్స్ ఇలా ఏ పాత్ర‌ల‌నైన ప‌రకాయ ప్ర‌వేశం చేసి ప్రేక్ష‌కుల‌కి వినోదాన్ని అందిస్తారు వెంకీ. ఈ రోజు వెంక‌టేష్ 59వ బ‌ర్త్‌డే. ఈ సంద‌ర్భంగా అభిమానులు, సెల‌బ్రిటీలు, ప‌లువురు ప్ర‌ముఖులు ఆయ‌న‌కి శుభాకాంక్ష‌ల వెల్లువ కురిపిస్తున్నారు. రామానాయుడు వార‌సుడిగా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన వెంక‌టేష్ అతి త‌క్కువ కాలంలోనే మంచి హీరోగా పేరు తెచ్చుకున్నాడు. విక్టరీనే త‌న ఇంటి పేరుగా మార్చుకున్న వెంకీ ఫ్యామిలీ ఆడియ‌న్స్‌ని ఎక్కువ‌గా ఆక‌ర్షించాడు. క‌లిసుందాం రా, ప్రేమించుకుందాం రాం, నువ్వు నాకు న‌చ్చావ్‌, ప‌విత్ర బంధం, గ‌ణేష్‌, ల‌క్ష్మీ, తుల‌సి వంటి చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించాడు వెంకీ తెలుగులో మ‌ల్టీస్టార‌ర్ ట్రెండ్‌ని మ‌రోసారి తీసుకొచ్చి అద్భుత‌మైన హిట్స్ సాధిస్తున్నారు వెంక‌టేష్‌.…

Read More

బాకీల, బొందలగడ్డ తెలంగాణగా మార్చారు: రేవంత్ రెడ్డి

ముఖ్యమంత్రి కేసీఆర్ ఏడాది పాలనపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తానని చెప్పిన కేసీఆర్.. బొందలగడ్డ తెలంగాణగా, బాకీల తెలంగాణగా మార్చేశారని ధ్వజమెత్తారు. కేసీఆర్ పరిపాలనతో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు విషాదంలో కూరుకుపోయారని విమర్శించారు. రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత ప్రజలకిచ్చిన ఏ ఒక్క హామీనీ ఆయన నెరవేర్చలేదన్నారు. గురువారం (డిసెంబర్ 12) సాయంత్రం పార్లమెంట్ ఆవరణలో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మిగులు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రాన్ని ఆరేళ్లలో అప్పుల కుప్పగా మార్చారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ఏర్పాటు సమయంలో తెలంగాణ రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో ఉండగా.. ప్రస్తుతం రూ.3 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పారు. బంగారు తెలంగాణ కాదని.. బాకీల తెలంగాణ అయిందని ఎద్దేవా…

Read More