అయోధ్యలో రామ మందిర నిర్మాణంపై చెప్పిందే చేశాం: మోదీ

అయోధ్యలో రామ మందిర నిర్మాణ విషయంలో తాము ఎన్నికల ముందు చెప్పిందే ఇప్పుడు చేశామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జార్ఖండ్ లోని ధన్ బాద్ లో బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ… ‘ఎన్నో ఏళ్లుగా ఉన్న అయోధ్య సమస్యను శాంతియుతంగా పరిష్కరిస్తామని మేము హామీ ఇచ్చాము. అయోధ్య సమస్య పరిష్కారం అంశాన్ని కాంగ్రెస్ మాత్రం ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటూ వచ్చింది. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ఇప్పుడు మార్గం సుగమమైంది’ అని వ్యాఖ్యానించారు. దేశంలోని ప్రజలందరికీ బీజేపీపై నమ్మకం ఉందని, తాము ఎన్నికల హామీలన్నింటినీ అమలు చేస్తున్నామని మోదీ అన్నారు. ‘పౌరసత్వ సవరణ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాల్లో ఆందోళనలకు ఆజ్యం పోసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ చర్యలతో ప్రజలు తప్పుదోవ పట్టొద్దు. దీనివల్ల అసోంతో పాటు ఇతర రాష్ట్రాల్లో వారి…

Read More

ప్రముఖ నటుడు గొల్లపూడి మారుతీరావు ఇకలేరు

ప్రముఖ నటుడు గొల్లపూడి మారుతీరావు (80) ఇకలేరు. అనారోగ్యంతో బాధపడిన ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ సినిమాతో నటుడిగా సినీరంగ ప్రవేశం చేశారు. అంతకు ముందు నాటకాలు, నవలలు, కథలు కూడా రచించారు. విజయవాడ ఆకాశవాణి కేంద్రంలోనూ పనిచేశారు. సినీరంగంలో దాదాపు 300కు పైగా సినిమాల్లో నటించారు. తెలుగు సినీ రంగంలో మాటల రచయితగానూ పేరు తెచ్చుకున్నారు. సినీరంగంలో మొదటి రచన ‘డాక్టర్ చక్రవర్తి’కి ఉత్తమ రచయితగా ఆయన నంది పురస్కారం అందుకున్నారు. గొల్లపూడి రచనలు కొన్ని విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా ఉన్నాయి. తెలుగు నాటక రంగం మీద ఆయన రాసిన వ్యాసాల సంపుటి ఆంధ్ర విశ్వవిద్యాలయం లోని థియేటర్ ఆర్ట్స్ విభాగంలో పాఠ్యపుస్తకంగా ఉంది. మారుతీరావు 1939, ఏప్రిల్‌ 14న విజయనగరంలో జన్మించారు. ఆయన…

Read More