ఆర్టీసీ కార్మికుల విషయంలో కేసీఆర్ కీలక నిర్ణయం

ఆర్టీసీ కార్మికుల విషయంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఆర్టీసీ కార్మికులను డిస్మిస్ చేసి సంచలనానికి తెరదీసిన విషయం తెలిసిందే. దీంతో వారికి ఆర్టీసీ ఆసుపత్రిలో వైద్యం కూడా నిలిచిపోయింది. మరోవైపు కేసీఆర్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా ఆర్టీసీ కండక్టర్‌లు, డ్రైవర్ల నియామకానికి చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కండక్టర్‌లు, డ్రైవర్ల నియామకానికి కసరత్తు చేయాలని… అధికారులకు కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. రేపు, ఎల్లుండి రెండు రోజుల పాటు డ్రైవర్‌లు, కండక్టర్ల నియామకంపై.. రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ ఫైల్‌ను సిద్ధం చేయనున్నారు. ఆ తర్వాత కొత్త డ్రైవర్లు, కండక్టర్ల రిక్రూట్‌మెంట్‌పై ప్రభుత్వ నిర్ణయం తీసుకోనుంది. కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయంపై ఆర్టీసీ కార్మిక సంఘాలు ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాలి.

Read More

మా నాయకుడు రాహుల్ గాంధీ పారిపోతున్నారు: సల్మాన్ ఖుర్షీద్ సంచలన వ్యాఖ్యలు!

రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఓటమితో పాటు, తమ అధీనంలో ఉన్న ఒక్కో రాష్ట్రాన్నీ కోల్పోతున్న కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్, ఏకంగా రాహుల్ గాంధీని టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పించారు. ఆయనే పార్టీకి ఓ అతిపెద్ద సమస్యని అభివర్ణించారు. రాహుల్ అన్ని విషయాల్లోనూ ఎదురు నిలవకుండా పారిపోతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి కొత్త చీఫ్ ఎన్నిక ఈ నెలలో జరిగే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. రాహుల్ వైఖరితో పార్టీలో ఓ రకమైన శూన్యం ఏర్పడిందని, దాన్ని భర్తీ చేసేందుకు సోనియా గాంధీ ప్రయత్నిస్తున్నా, కుదరడం లేదని అన్నారు. యూపీలోని 80 సీట్లలో కేవలం ఒకే ఒక్క సీటును కాంగ్రెస్ గెలుచుకోవడం, స్వయంగా రాహుల్…

Read More

ఇరు తెలుగు రాష్ట్రాలకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన!

దేశంలోని పలు రాష్ట్రాల్లో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని ఢిల్లీలోని కేంద్ర వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు మధ్య మహారాష్ట్ర, యానాం, కర్ణాటక, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, అసోం ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తాజా బులెటిన్ లో తెలిపింది. సిక్కిం, పశ్చిమబెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు కూడా పడే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.

Read More

మరింత ఉద్ధృతమైన తెలంగాణ ఆర్టీసీ సమ్మె.. ఐదో రోజూ డిపోలకే పరిమితమైన బస్సులు

26 డిమాండ్లతో తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఐదో రోజూ కొనసాగుతోంది. నేడు కూడా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం ససేమిరా అనగా, మరోవైపు సమ్మెను మరింత ఉద్ధృతం చేయాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి. ఆర్టీసీ కార్మికుల భవిష్యత్‌పై నేడు టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరాం అధ్యక్షతన సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో అఖిలపక్ష సమావేశం జరగనుంది. విద్యార్థి సంఘాలు, ప్రజాసంఘాలు ఈ సమావేశంలో పాల్గొననున్నాయి. ఈ సమావేశంలో ఆర్టీసీ కార్మికుల భవితవ్యం, భవిష్యత్ పోరాటంపై చర్చించనున్నారు. మరోవైపు, ఐదో రోజు కూడా బస్సులు రోడ్డెక్కకపోవడంతో ఆర్టీసీ యాజమాన్యం తాత్కాలిక సిబ్బందితో పాక్షికంగా బస్సులు నడుపుతోంది.

Read More

హీరోగా వీవీ వినాయక్‌..టైటిల్‌ ఇదే.. ఫస్ట్‌ లుక్‌ విడుదల

ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్‌ హీరోగా స్టార్‌ ప్రొడ్యూసర్‌ దిల్‌ రాజు ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విజయ దశమి సందర్భంగా సినిమా ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం ఇవాళ విడుదల చేసింది. ఈ చిత్రానికి సీనయ్య అనే టైటిల్‌ ఖరారు చేశారు. వినాయక్‌ మాస్‌ లుక్‌తో దర్శనమిస్తున్నాడు. డైరెక్టర్‌ శంకర్‌ దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేసిన ఎన్.నరసింహ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. గతంలో ఈయన శరభ అనే సినిమాను తెరకెక్కించారు. సాయి ధరమ్‌ తేజ్‌ హీరోగా 2018లో వచ్చిన ఇంటెలిజెంట్‌ సినిమాకు వినాయక్‌ చివరగా దర్శకత్వం వహించారు. మణిశర్మ సంగీతం అందించనున్నట్లు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పేర్కొంది. త్వరలో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభమవుతుందని తెలిపింది. బుధవారం వినాయక్‌ 45వ పుట్టినరోజు జరుపుకోనున్న విషయం తెలిసిందే.

Read More