రవిప్రకాశ్ ను పరామర్శించేందుకు చంచల్ గూడ జైలుకు వెళ్లనున్న రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి హైదరాబాదులోని చంచల్ గూడ జైలుకు వెళ్లనున్నారు. జైల్లో ఉన్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ ను పరామర్శించి, సంఘీభావం తెలపనున్నారు. టీవీ9 సీఈవోగా ఉన్న సమయంలో రవిప్రకాశ్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, నిధులను అక్రమంగా దారి మళ్లించారంటూ ఆ ఛానల్ ప్రస్తుత యాజమాన్యం కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఆయనను పోలీసులు అరెస్ట్ చేసి, కోర్టులో ప్రవేశపెట్టగా… న్యాయమూర్తి రెండు వారాల జ్యుడీషియల్ కస్టడీని విధించారు. దీంతో, ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో పలువురు రాజకీయ నేతలు రవిప్రకాశ్ కు సంఘీభావం తెలుపుతున్నారు.

Read More

టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న పవన్ కల్యాణ్ కుమారుడు?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన తన పూర్తి దృష్టిని రాజకీయాలపైనే ఉంచారు. ఈ నేపథ్యంలో, పవన్ వారసుడు అకీరా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే అకీరా మరాఠీలో ఓ సినిమా చేశాడు. ఆ చిత్రాన్ని తెలుగులోకి అనువదించి రిలీజ్ చేయాలని అనుకున్నారు. అయితే, డబ్బింగ్ సినిమాతో కాకుండా, డైరెక్ట్ మూవీతో తన కుమారుడిని లాంచ్ చేయాలని పవన్ భావిస్తున్నారట. త్వరలోనే అకీరా టాలీవుడ్ ప్రవేశం ఉంటుందని చెబుతున్నారు. మరో సమాచారం ప్రకారం… తన అన్నయ్య రామ్ చరణ్ నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడక్షన్ లోనే ఈ చిత్రం తెరకెక్కబోతోందని సమాచారం.

Read More

సానియామీర్జా చెల్లెలి పెళ్లి…వరుడు ఎవరంటే…

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా చెల్లెలైన ఆనంమీర్జా పెళ్లి కూతురు కానుందా? అవునంటున్నారు ఆనంమీర్జా తన ఇన్ స్టాగ్రాం పోస్టులో… హైదరాబాద్ : భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా చెల్లెలైన ఆనంమీర్జాను భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజారుద్దీన్ కుమారుడు అసద్ పెళ్లాడనున్నట్లు సమాచారం. అసద్,ఆనందమీర్జాల వివాహం ఈ ఏడాది డిసెంబరులో స్నేహితులు, కుటుంబసభ్యుల సమక్షంలో జరగనుందని వెల్లడైంది. గతంలో ఆనం, అసద్ లు చెట్టాపట్టాలేసుకొని తిరగడంతో వారిద్దరూ ప్రేమించుకుంటున్నారంటూ పుకార్లు షికారు చేశాయి. ఎట్టకేలకు ఆనంమీర్జా తాను ‘‘కాబోయే వధువు’’అంటూ తన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. గతంలోనూ ఆనం, అసద్‌లు తాము చెట్టాపట్టాలేసుకొని దుబాయ్‌లో తిరిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టారు. గతంలో అసద్, ఆనంలు ఒకరికొకరు జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకున్నారు. తన జీవితంలో అసద్ అత్యంత అద్భుతమైన వ్యక్తి అంటూ…

Read More

ఆర్టీసీకి కొత్త రూపు

ఆర్టీసీ చరిత్రలో నూతనాధ్యాయాన్ని ప్రారంభించబోతున్నట్టు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఇందులో భాగంగా ఆర్టీసీని లాభాల్లోకి తీసుకురావాలన్నారు. సంస్థ మనుగడకు కొన్నిచర్యలు తప్పవని చెప్పారు. ఈ క్రమంలో ఆర్టీసీలో సగం యాజమాన్య బస్సులు, మరోసగం ప్రైవేటుబస్సులు ఉంటాయని తెలిపారు. ఉద్యోగులు విధుల్లోకి రాని క్యాటగిరీల్లో కొత్తగా నియామకాలు జరుపుతామని చెప్పారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం మధ్యాహ్నం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ఆర్టీసీ ఏటా రూ.1200 కోట్ల నష్టం, రూ.5000 కోట్ల రుణభారం, క్రమంగా పెరుగుతున్న డీజిల్ ధరలతో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నదని పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో చట్టవిరుద్ధమైన సమ్మెకు, అదీ పండుగల సీజన్‌లో దిగినవారితో ఎలాంటి రాజీలేదని, వారు తీవ్ర తప్పిదంచేశారని సీఎం అన్నారు. వారితో ఎలాంటి చర్చలు జరిపేది స్పష్టంచేశారు. ఎట్టి పరిస్థితుల్లో…

Read More

టీఎస్‌ఆర్‌టీసీ కార్మికుల సమ్మెకు మావోయిస్టులు మద్దతు

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు మూడు రోజులుగా చేస్తున్న సమ్మెకు మావోయిస్టులు మద్దతు పలికారు. కార్మికులు తమ కోర్కెలు సాధించుకునే వరకు పోరాటం ఆపవద్దని పిలుపునిచ్చారు. అవసరమైతే మిలిటెంట్‌ పోరాటం చేయాలని సూచించారు. ఈ మేరకు మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి జగన్‌ బహిరంగ లేఖ విడుదల చేశారు. ప్రస్తుతం ఆర్టీసీ ఎదుర్కొంటున్న నష్టాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని లేఖలో పేర్కొన్నారు. చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకుండా పెండింగ్‌లో ఉంచడం వల్లే సంస్థ నష్టాలు ఎదుర్కొంటోందన్నారు. ఆర్టీసీని ప్రైవేటు పరం చేసే ఆలోచన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ఉందని, ఈ కారణంగానే ప్రభుత్వంలో విలీనం చేయడం లేదని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికులకు అన్ని వర్గా ప్రజలు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.

Read More